Tiger Route Changed: మహారాష్ట్రకు మకాం మార్చిన కొత్త పులి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో పులులు జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 4 పులులు సంచరించడం కలకలం రేపుతోంది..మొన్నామద్య రోడ్డుపై నాలుగు పులులు కనిపించగా తాజాగా మరో సారి పత్తి చేనులో రైతుకు పులులు కనిపించడంతో రైతులు భయకంపితులు అవుతున్నారు. మరో వైపు పులుల పాదముద్రలు ట్రాకింగ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. .టైగర్ ఫియర్ ట్రాకింగ్ కొలిక్కి వస్తే ఎన్ని పులులు వున్నాయనేది అంచనాకు రావచ్చంటున్నారు అధికారులు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తాంసికే శివారులో కనిపించిననాలుగు పులులు,కొద్ది రోజుల వ్యవధిలో రెండో సారి కనిపించాయి నాలుగు పులులు. బెజ్సూర్ మండలం, మర్తడి,కుంటలు ,కుకుడ శివారు ప్రాంతాల్లో సంచరిస్తుంది పులి.
కొమురం భీం జిల్లాలో రాత్రిళ్ళు కనిపిస్తున్న పులులు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. ఈ కొత్త పులి రాష్ట్ర సరిహద్దులు దాటిందని తెలుస్తోంది. ఈ నెల 15 వ తేదీ నుంచి జిల్లాలో హల్చల్ చేసింది ఈపులి. పంట పాలాలు, గ్రామాల్లో సంచరించిన పులి ఎద్దులు, బర్రెలు, మేకలు, ఆవులపై దాడి చేసింది. ఎట్టకేలకు ప్రాణహిత దాటి పొరుగు రాష్ట్రం లోకి వెళ్లింది పులి. పాద ముద్రలను బట్టిఈ మేరకు నిర్ధారించారు అటవీ శాఖ అధికారులు. దాదాపు వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసిందీ కొత్త పులి. బెజ్జూర్ మండలం ప్రాణహిత దాటి మహారాష్ట్ర వైపు వెళ్ళినట్లు గుర్తించారు అటవీశాఖ అధికారులు.
Also Read
- Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
- Supreme Court: సీఈసీ నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. జడ్జిలు భిన్నాభిప్రాయాలు
- JSW Group: ఇక ఎలక్ట్రిక్ ట్రక్కుల వంతు.. 55 టన్నుల ట్రాక్టర్-ట్రైలర్‌తో ఎంట్రీ..
- KTR: కరెంట్ కోతలపై కేటీఆర్ ఫైర్.. ‘ఇది ఎల్ నినో కాదు.. ఎల్ కాంగ్రెస్’.!
Read Also: Russia-Ukraine War: మరోసారి బయటపడ్డ రష్యా అరాచరకాలు.. ఖేర్సన్‌లోనూ రిపీట్
కొమరంభీం జిల్లాలోని బెజ్జూర్ మండలం నాగేపల్లి, కోయపల్లి శివారులో పెద్దపులి సంచారం భయాందోళనలు కలిగిస్తోంది. పులి పాదముద్రలు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు అప్రమత్తంగా వుండాలని ప్రజలకు సూచించారు. తమ ప్రాంతంలో పులి తిరుగుతోందని భయాందోళనలో పరిసర గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. బెజ్జూర్ మండలంలో రెండురోజుల క్రితం పులి సంచారం కలకలం రేపింది. కుకుడా గ్రామంలో కొట్టంలో కట్టేసి ఉన్న ఎద్దుపై పెద్దపులి దాడి చేసింది. దీంతో ఎద్దుకు గాయాలు కాగా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు స్ధానికులు. అనంతరం బాబా సాగర్ కుంట వద్ద కనిపించిన పులి తాజాగా ఆత్రం శ్యాం రావ్ అనే రైతుకు చెందిన ఎద్దుపై దాడి చేయగా పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురైతున్నారు. అడవిలో ఉండాల్సిన పులి గ్రామాల్లోకి రావడంతో ఎప్పుడు ఎం జరుగుతుందో ఎక్కడ మీద పడుతుందోనని టెన్షన్ పడుతున్నారు జనం.
Read Also: 41st Convocation Of SSSIHL Live: సత్యసాయి వర్సిటీ స్నాతకోత్సవం లైవ్
తాజావార్తలు
-
Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
-
Srikanth Odela: : నాని ‘జడల్’ లుక్ వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరో తెలుసా?
-
DA Release : తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెండు డీఏలకు గ్రీన్ సిగ్నల్.!
-
Nani : ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సినిమా.. హుందాగా వెనక్కి తగ్గిన న్యాచురల్ స్టార్!
-
Supreme Court: సీఈసీ నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. జడ్జిలు భిన్నాభిప్రాయాలు
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!