Tiger Hunt Duck: తరచుగా అడవిలో భయంకరమైన జంతువులు.. చిన్న జంతువులను తింటూ ఉంటాయి. అందులో ఒక్కో జంతువును వేటాడే విధానం ఒక్కోలా ఉంటుంది. శక్తివంతమైన జంతువులేమో ముందు నుండి దాడి చేస్తాయి. కొన్నేమో దాక్కుని వెనుక నుండి వేటాడుతాయి. అడవిలో ఎక్కడ, ఎప్పుడు ఏ జంతువు దాడి చేస్తుందో అంచనా వేయడం చాలా కష్టం. సింహాలు, చిరుతలు లేదా పులులు ఆహారం కోసం క్షణికావేశంగా ఉంటాయి. అలాంటప్పుడు వాటికి ఏవి కనపడితే వాటిని చంపి తింటాయి. అలాంటి పరిస్థితుల్లోనే ఒక చిన్న బాతు పులిని తప్పించగలదని ఎవరైనా అనుకోగలరా?. కానీ అలాంటి దృశ్యమే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో కనిపిస్తోంది. ఈ క్లిప్‌ను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ క్లిప్ పాతదే అయినా మరోసారి వైరల్ అవుతోంది.
TSPSC : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో 19 మంది అరెస్ట్..
కేవలం 20 సెకన్ల ఈ వైరల్ వీడియో జనాలకు వినోదాన్ని ఇస్తుంది. కానీ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా దీని ద్వారా ప్రజలకు ఒక ముఖ్యమైన పాఠాన్ని వివరించారు. అతను క్యాప్షన్‌లో.. విజయం కొన్నిసార్లు మీ తదుపరి కదలికపై స్పష్టంగా తెలియకపోవడం వల్ల వస్తుందని రాశాడు. అయితే ఆ వీడియోలో ఒక చిన్న చెరువులో పులి, బాతు కనిపిస్తాయి. పులి బాతుపైకి దూసుకెళ్లడానికి ప్రయత్నించిన వెంటనే, బాతు నీటిలోకి డైవింగ్ చేయడం ద్వారా తన దాడి నుండి తనను తాను రక్షించుకుంటుంది. తన ముందు నుండి బాతు వెళ్ళినట్లు పులి భావిస్తుంది. అంతేకాకుండా చూపు తిప్పి అక్కడక్కడ వెతకడం మొదలు పెడుతుంది. అయితే ఈ వీడియోపై పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒకరేమో పులి ఆశ్చర్యపోయింది. మరొకరేమో.. సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్, చార్లెస్ డార్విన్ అని కామెంట్ చేశారు. ఈ వీడియో చూశాక బలమే కాదు తెలివి కూడా ముఖ్యమైనది అని చెప్పక తప్పదు.
Success, and sometimes survival, comes from not making your next move an obvious one…😊 #MondayMotivaton pic.twitter.com/eezOQvMJVS
— anand mahindra (@anandmahindra) July 10, 2023