Hyderabad : హైదరాబాద్ శివారులో పెద్దపులి సంచారం కలకలం
- హైదరాబాద్ శివారుల్లో పులి సంచారం కలకలం
- గ్రామాల్లో వరుసగా పశువులపై దాడులు
- థర్మల్ డ్రోన్లు, ట్రాప్ బోన్లతో హంట్ ఆపరేషన్
- అటవీ శాఖ ప్రజలకు అలర్ట్.. అప్రమత్తంగా ఉండండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. గత 15 రోజులుగా చుట్టుపక్కల గ్రామాల్లో పులి వరుస దాడులకు తెగబడుతుండటంతో అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ముఖ్యంగా పశువుల కాపరులు, రైతులు తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని పొలాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
యాదాద్రి జిల్లాలోని దత్తాయపల్లి, ఇబ్రహీంపూర్ , బేగంపేట అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు అధికారులు ధృవీకరించారు. జనవరి 26వ తేదీన దత్తాయపల్లి గ్రామ పరిధిలో ఒక లేగదూడపై దాడి చేసిన పులి, దానిని చంపి తినేసింది. ఆ తర్వాత మరో ఆవు , దూడ కూడా కనిపించకుండా పోవడం, వాటిపై కూడా పులి దాడి చేసినట్లు ఆనవాళ్లు లభించడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 5 పశువులు పులికి ఆహారమైనట్లు సమాచారం.
Also Read
పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. జంతువు కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు అడవిలో పలు రకాల ఏర్పాట్లు చేశారు. అడవిలో పులి తిరిగే ప్రధాన మార్గాల్లో సుమారు 22 మోషన్ కెమెరాలను అమర్చారు. దట్టమైన అడవిలో పులి ఎక్కడ నక్కి ఉందో కనిపెట్టడానికి అత్యాధునిక థర్మల్ డ్రోన్లను రంగంలోకి దించారు. ఇవి శరీర ఉష్ణోగ్రత ఆధారంగా జంతువులను గుర్తిస్తాయి. పులి పాదముద్రలు కనిపించిన రెండు ప్రధాన ప్రాంతాల్లో పెద్ద బోన్లను ఏర్పాటు చేశారు. పులిని ఆకర్షించేందుకు ఆ బోన్లలో మేకలను ఎరగా ఉంచారు.
పరిస్థితి తీవ్రతను బట్టి జిల్లా అటవీ శాఖ అధికారులు (DFO), ఎంఆర్ఓ , పోలీసులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. దత్తాయపల్లి సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేశారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారు. రైతులు ఎవరూ ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, పశువులను అడవి వైపు తోలవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. పులిని సురక్షితంగా పట్టుకుని టైగర్ రిజర్వ్ జోన్‌కు తరలించే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!