జగిత్యాల జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి అయితే చాలు దొంగలు తమ చేతులకు పని చెబుతున్నారు. మద్యం షాపుకే కన్నం వేసేందుకు పాల్పడ్డారు. వరుస దొంగతనాలకు పాల్పడుతూ బీభత్సం సృష్టిస్తున్నారు.
ఓ వ్యక్తి మంచి చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాడు. చదువుకున్న యువతి అయితే పుట్టిన పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటుందని భావించి స్నేహితుల సలహా మేరకు ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికూతురు ఆమె భర్త ఇంటికి వెళ్లి భర్తతో పాటు అతని కుటుంబసభ్యులకు స్వయంగా హల్వా చేసి పెట్టింది.
ఈ డ్రైవర్ మామూలోడు కాదు. ఏటీఎంను డబ్బులు జమ చేసేందుకు వచ్చిన సిబ్బందినే బురిడీ కొట్టించి అక్కడ వదిలేసి డబ్బులతో ఉడాయించాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 36 లక్షల వరకు తీసుకుని వ్యాన్ నుంచి బ్యాంక్ సిబ్బంది దిగగానే వ్యాన్ తోనే అక్కడ నుంచి జారుకున్నారు.
Theft In Apple Company: తిన్నంటికే కన్నం వేయడం అంటే ఇదేనేమో.. అన్నం పెట్టిన కంపెనీకే సున్నం వేయాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. పనిచేస్తున్న కంపెనీలోనే రూ.140కోట్లు కొట్టేసి ఝలక్ ఇచ్చాడు.
హైదరాబాద్ లోని కుషాయిగూడ పోలిస్ స్టేషన్ పరిధిలో బజాజ్ ఎలక్ట్రానిక్స్ చోరీ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. వారి వద్దనుంచి 70 లక్షల విలువైన మొబైల్ ఫోన్‌ల రికవరీ చేసారు.
తామిద్దరం భార్యాభర్తలమని చెప్పి ఓ ఇంట్లో పని మనుషులుగా చేరిన ఓ జంట.. అదును చూసి భారీ చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఓనర్లు లేని సమయం చూసి.. నగదు, నగలు దోచేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. నేపాల్‌కి చెందిన చక్రధర్, సీత అనే జంట 8 నెలల క్రితం వి. దామోదర్‌రావు ఇంట్లో పనిమనుషులుగా చేరారు. మూడేళ్ల కుమారుడు కూడా కలిగిన ఈ దంపతులు.. ఆ ఇంటి ప్రాంగణంలోనే…
దొంగల్లో పలు రకాలు ఉంటారు. ఒకరు డబ్బులు దొంగతనం చేస్తే.. మరొకరు నగలు చోరీ చేస్తుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం బట్టల దుకాణంలో బట్టలు దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు రిలయన్స్ ట్రెండ్స్‌లో మంగళవారం నాడు చోరీ జరిగింది. బట్టలు దొంగతనం చేస్తూ ఓ వ్యక్తి సీసీ కెమెరాకు చిక్కాడు. దీంతో రిలయన్స్ విజిలెన్స్ విభాగం అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి పాల్పడిన వ్యక్తి మక్కువ…
చాంద్రాయణగుట్ట నల్లవాగు శ్మశానవాటికలో అర్ధరాత్రి చోరీ జరిగింది. 30వేల నగదును శ్మశాన వాటిక కార్యాలయం నుంచి దొంగలు ఎత్తుకెళ్లారు. శ్మశాన వాటిక నిర్వహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఇటీవలే ఓ అంత్యక్రియల కోసం శ్మశాన వాటిక నిర్వాహకులు డిపాజిట్ చేసిన 30 వేల నగదు మాయమైంది. దీంతో చంద్రయాన్ గుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సిబ్బంది తెలిపిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని గల నల్లవాగు స్మశాన…