దొంగలు రెచ్చిపోతున్నారు. అటు పోలీసులకు, ఇటు జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో గత కొంతకాలంగా దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేసి చోరీలు చేస్తున్నారు. ఈ సారి అక్కడ ఇక్కడని కాకుండా ఏకంగా ఎమ్మెల్యే ఇంటి పక్కనే ఉన్న కేకే మంజిల్ ఇంటికి కన్నం వేసి సుమారు 15 లక్షల విలువ చేసే బంగారం దోచుకెళ్లారు. బాధితుడు ఖాలీద్ చెప్పిన వివరాల మేరకు బుధవారం ఖాలీద్ కుటుంబ సభ్యులు బెంగళూరు వెళ్లి గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నారు.
Read Also: Expired Food in Anganwadis: అంగన్ వాడీల్లో కాలం చెల్లిన ఆహారం
అయితే అప్పటికే ఇంటి తలుపులు తెరిచి ఉండడం చూసి అవాక్కయ్యారు. లోపలకు వెళ్లి వెళ్లి పరిశీలించగా ఇంట్లో దొంగతనం జరిగినట్టు గుర్తించారు. ఇంట్లో ఉన్న 15 తులాల బంగారు నగలు కనిపించడం లేదని పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని ఉదయం డాగ్ స్క్వాడ్ , క్లూస్ టీమ్ వచ్చి ఘటనా స్థలంలో దొంగల ఆధారాల కోసం పరిశీలనలు చేశారు. వేలిముద్రల ఆధారంగా వీలైనంత త్వరలో దొంగలని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ దొంగతనాల నేపథ్యంలో ఊరికి వెళ్లాలంటేనే జనం వణికిపోతున్నారు.
Read Also: Kabul Blast: కాబూల్ బాంబ్ పేలుడులో 100కు చేరిన మృతులు.. చనిపోయిన వారిలో ఎక్కువ మంది బాలికలే..