ఈజీమనీ కోసం దొంగతనాలు చేసేవారు ఎక్కువయ్యారు. అయితే ఆధునిక టెక్నాలజీ సాయంతో వారి ఆటలు సాగడం లేదు. గుట్టుచప్పుడు కాకుండా దొంగతనాలు చేసేవారు గుట్టు రట్టవుతోంది. సీసీ కెమేరాలతో పాటు సెల్ ఫోన్ సిగ్నల్స్, జీపీఎస్ ద్వారా దొంగల్ని పట్టుకుని సొత్తు రికవరీ చేస్తున్నారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జీపీఎస్ ద్వారా బుల్లెట్ దొంగలు పట్టుబడ్డారు. కడియపులంకలో చోరీకి గురైన రెండు లక్షల రూపాయల బుల్లెట్ జీపీఎస్ ద్వారా గుర్తించారు పోలీసులు. చోరీకి గురైన తన…
రాజేంద్ర నగర్‌లోని కాటేదాన్ లో దోపిడీ దొంగల గ్యాంగ్ హల్ హల్ సృష్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓల్డ్ కర్నూల్ రోడ్డు వద్ద యాసిన్ అనే ఆటో డ్రైవర్‌కు తుపాకీ చూపించి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయాందోళనకు లోనై యాసిన్ ఆటోను విడిచిపెట్టి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో యాసిన్ వెంటబడ్డ దొంగల ముఠా అతనిపై దాడి చేసి రూ.3200లతో పాటు అతని మొబైల్ ఫోన్ లాక్కొని వెళ్లిపోయారు. దీంతో బాధితుడు యాసిన్ వెంటనే మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు…
దొంగలు రెచ్చిపోతున్నారు. తిరుపతిలోని శ్రీనివాసమంగాపురం, కనకదుర్గమ్మ ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఆలయం వెనుకవైపు నుంచి లోనికి ప్రవేశించిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. గర్భగుడిలో అమ్మవారి విగ్రహంపై ఉన్న బంగారం, వెండి నగలు మాయం అయ్యాయి. రెండు సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు దుండగులు. రంగంలోకి దిగిన పోలీసులు, క్లూస్, డాగ్ టీమ్స్ పరిశీలిస్తున్నారు. సీసీ టీవీల ఆధారంగా నిందితుల్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఆలయంలో చోరీపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ కొల్చారంలో ఐఎంఎల్ ( మద్యం స్టోరేజ్ సెంటర్) కి బీరు బాటిల్స్ తీసుకొస్తున్న లారీని దొంగలించారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ లో బీర్ ఫ్యాక్టరీ లో కార్టన్లను లారీ లో లోడ్ చేసారు. అక్కడి నుండి కొల్చారం మండలం చిన్న ఘనపూర్ డిపోలో లోడ్ ను దింపేందుకు లారీ వచ్చింది. కానీ అక్కడ వరుసగా లారీల క్యూ ఉండడంతో డ్రైవర్ ఇంటికి వెళ్ళాడు. సమయం చూసుకొని లారీతో సహా బీర్లను తీసుకుని వెళ్లి పోయారు దొంగలు.…
సికింద్రాబాద్ శాంసంగ్ మొబైల్ స్టోర్ లో ఫోన్ లు చోరికి గురైన సంఘటన కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదిహేను లక్షల వరకూ విలువైన సెల్ఫోన్లోనూ గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు స్టార్ సిబ్బంది. నిన్న రాత్రి సమయంలో శామ్సంగ్ మొబైల్ స్టోర్ లోకి ప్రవేశించి గుర్తుతెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. లక్షల రూపాయల విలువైన సెల్ఫోన్లను అపహరించుకుని వెళ్లిపోయారు. ఉదయాన్నే మొబైల్ స్టోర్…