హైదరాబాద్ నగరంలోని మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో విచిత్రం చోటుచేసుకుంది. ఓ దొంగ మొబైల్ టాయ్‌లెట్‌ను చోరీ చేసిన వార్త హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 16న సఫిల్‌గూడ చౌరస్తాలోని మొబైల్ టాయ్‌లెట్ కనిపించకపోవడంతో పారిశుధ్య కార్మికులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీపీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేశారు. మొబైల్ టాయ్‌లెట్‌ను తీసుకెళ్లిన నిందితుడు దోమల్‌గూడలో నివసించే మెదక్ జిల్లా అందోల్ మండలం…
మా ప్రెసిడెంట్ మంచు విష్ణుకు దొంగలు ఝలక్ ఇచ్చారు. ఫిల్మ్ నగర్ లో ఉన్న మా ఆఫీస్ లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. మంచు విష్ణు ఆఫీసులో హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రిని గుర్తుతెలియని దుండగులు అపహరించినట్లు తెలుస్తోంది. వాటి విలువ సుమారు రూ. 5లక్షల ఉంటుందని అంచనా.. ఈ చోరీపై విష్ణు మేనేజర్ సంజయ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీనునే ఈ చోరీకి పాల్పడి ఉంటాడని, అతను…
మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలోని సాయిబాబానగర్‌లో ఏటీఎం నగదుతో ఉడాయించిన డ్రైవర్ సాగర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు నగరాలు తిరిగిన అనంతరం నగరంలో జేబీఎస్ బస్టాండ్‌లో డ్రైవర్ సాగర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 19వ తేదీన రైటర్స్ సంస్థ సిబ్బంది ఏటీఎంలో నగదు నింపటానికి వెళ్లారు. ఆ సమయంలో డ్రైవర్ సాగర్ 36 లక్షలతో పరారయ్యాడు. వాహనాన్ని నర్సాపూర్ అడవిలో వదిలేసి నగదుతో వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. వివిధ బస్సులు మారుతూ…
ఏపీ రాజధాని అమరావతిలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రభుత్వ భవనాలే టార్గెట్‌గా దొంగలు చేతివాటం చూపిస్తున్నారు. ఈ మేరకు నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల్లో విలువైన సామాన్లను దొంగలు దోచుకెళ్తున్నారు. సచివాలయం, అసెంబ్లీ పక్కనే రూ.110 కోట్లతో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాల్లో దొంగలు ప్రవేశించి విలువైన ఏసీలు, ఎల్‌ఈడీ లైట్లతో పాటు కరెంట్ వైర్లు, విలువైన ఎలక్ట్రికల్ సామాగ్రిని దోచుకుపోతున్నారు. ఆయా ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు కొంతకాలంగా నిలిచిపోవడంతో దొంగలకు అడ్డాగా మారుతున్నాయి. నిర్మాణాలలో…
సినీ ఫక్కిలో బస్సు దోపిడీకి యత్నించారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భైంసా నుంచి నవీపేట్ మీదుగా హైదరాబాద్‌కు భైంసా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున బయలు దేరింది. అయితే నవీపేట్ మండలం అబ్బాపూర్ (ఎం) గ్రామ సమీపంలోకి బస్సు రాగానే నలుగురు దుండగులు రాళ్లతో బస్సుపైకి దాడి చేసి దోపిడీ యత్నించారు. దీంతో ప్రతిఘటించిన ప్రయాణీకులు.. గట్టిగా కేకలు వేయడంతో ఆ నలుగురు దుండగులు…
పండుగలకు విందుభోజనం చేయడం మాములే.. అయితే విందుభోజనం కోసం మేక మాంసమో లేక చికెన్‌ను కొనుగోలు చేయాలి.. కానీ ఓ ఇద్దరు వ్యక్తులు మేకలు దొంగతనం చేసి సంక్రాంతి విందుభోజనం చేద్దామనుకున్నారు. కానీ చివరికి మేకలు ట్విస్ట్ ఇవ్వడంతో జైలు పాలయ్యాడు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మేకల గుంపులోని మేకను దొంగతనం చేసేందుకు ఇద్దరు రాత్రి వెళ్లారు. మేక గుంపులోకి వెళ్లారు తీరా మేకను దొంగతనం చేద్దామనుకొని మేకను పట్టుకునే…
ఓ రిటైర్డ్ ఉద్యోగి చెన్నైలో ఉంటున్న కొడుకు దగ్గరకు వెళ్లి వచ్చే సరికి దొంగలు ఇల్లు కొల్లగొట్టిన ఘటన శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తి పట్టణంలోని కొత్తకోనేరు వీధికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి చెన్నైలో ఉన్న తన కొడుకు ఇంటికి తన భార్యతో కలిసి డిసెంబర్ 31న వెళ్లాడు. అయితే చెన్నై నుంచి తిరిగి రావడానికి ఇంటిలో వున్నకారు తీసుకొనిరా అని డ్రైవర్ ను పురామాయించాడు. దీంతో కారుకోసం ఇంటిదగ్గరకు…
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో మరోసారి దొంగలు రెచ్చిపోతున్నారు. నిజమాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో అర్థరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. దర్పల్లి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో 10 మంది దొంగలు చొరబడ్డారు. పెట్రోల్ బంక్‌లోని కార్యాలయంపై రాళ్లతో దాడి చేస్తూ సిబ్బందిని భయాందోళనకు గురి చేశారు. సిబ్బందిని బెదిరించి పెట్రోల్ బంక్‌లోని క్యాష్‌కౌంటర్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే క్యాష్ కౌంటర్లో సుమారు 40 వేలు ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారు. దీంతో వెంటనే పెట్రోల్ బంక్ సిబ్బంది పోలీసులకు…
హైదరాబాద్ మాదాపూర్ లోని కారు గ్యారేజ్ లో జరిగిన చోరీ కేసుని ఛేదించారు పోలీసులు. ముగ్గురిని అరెస్ట్ చేసి రూ.55 లక్షలు రికవరీ చేశారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీలక్ష్మీ మోటార్స్ కార్ గ్యారేజ్ లో ఈ నెల 9 న దొంగతనం జరిగింది.శ్రీ మోటార్స్ కారు సర్వీసు వర్క్ షాప్ లో ఉన్న 55 లక్షల నగదును దోచుకెళ్ళారు. కారు షో రూమ్‌లో మెకానిక్ గా పని చేసే వ్యక్తే ప్రధాన సూత్రధారిగా తేలింది.…
జంటనగరాల ప్రజలను భయాందోళనకు గురిచేసిన చెడ్డీగ్యాంగ్ ఇప్పుడు ఏపీలో దోపిడీలకు తెగబడుతున్నారు. ఏపీలోని పులివెందుల నుంచి గుండుగొలను వరకు చెడ్డీగ్యాంగ్ వరుస దోపిడీలకు పాల్పడిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌లో దొంగతనాలు చేసిని ఈ ముఠా ఇప్పడు విజయవాడలో ప్రత్యక్షమవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చిట్టినగర్, గుంటుపల్లిలో చెడ్డీగ్యాంగ్ ముఠా దోపిడీకి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఇటేవలే ఈ ముఠా పులివెందుల, తిరుపతి, ప్రకాశం, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో పలు దోపిడీలకు పాల్పడ్డ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే…