Wine Shop: జగిత్యాల జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి అయితే చాలు దొంగలు తమ చేతులకు పని చెబుతున్నారు. మద్యం షాపుకే కన్నం వేసేందుకు పాల్పడ్డారు. వరుస దొంగతనాలకు పాల్పడుతూ బీభత్సం సృష్టిస్తున్నారు. అడ్డు వచ్చిన వారిపై దాడి చేసి తీవ్ర భయాందోళనను సృష్టిస్తున్నారు. పోలీసులు ఎంత గస్తీ నిర్వహించిన తమ పని ఈజీగా చేసుకుంటూ హుడాయిస్తున్నారు.
Read also: Actor Prabhu: నటుడు ప్రభుకి తీవ్ర అస్వస్థత.. ఆ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో మహాలక్ష్మి వైన్ షాప్ లో చోరీ కలకలం రేపింది. వైన్ షాప్ ముందు రోజూ లాగానే సెక్యూరిటీ గార్డు కూర్చున్నాడు. కొందరు వైన్ షాప్ పై కన్నేసిన కొందరు దుండుగులు వైన్‌షాప్ లో వున్న మద్యాన్న కాజేసుకున్నందుకు ప్లాన్ వేసారు. చివరకు సెక్యూరిటీ గార్డు వున్న అతని పై కూడా దాడి చేసి మద్యాన్ని ఎత్తుకెళ్లేందుకు పక్కా ప్లాన్ వేసుకున్నారు. వారు అనుకున్న ప్రకారమే మహాలక్ష్మీ వైన్ షాప్ వద్దకు వెళ్లారు సెక్యూరిటీ గార్డును చూసారు. అతన్ని మాట్లల్లో పెట్టేందుకు చూసారు. మరొకరు వైన్ షాప్ లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించాగా సెక్యూరిటీ గార్డ్ అడ్డుకున్నాడు. దీంతో సెక్యూరిటీ గార్డ్ అని కూడా చూడకుండా విచక్షణారహితంగా దాడి చేశారు. వారితో తెచ్చుకున్న ఆయుధాలతో అతని చేతులు వేళ్లుపై విపరీతంగా దాడి చేయండతో షెక్యూరిటీ గార్డు తీవ్ర గాయాలతో కిందకు పడిపోయాడు. దీంతో దుండగులు వైన్ షాప్ లోని నగదు, లిక్కర్ ను ఎత్తుకెళ్లారు. సెక్యూరిటీ గార్డుకు తీవ్ర గాయాలై కిందపడిపోవడంతో స్థానికులు చూసి ఆసుపత్రికి తరలించారు. వైన్ షాప్ యజమానికి సమాచారం అందించారు. వైన్ షాప్ చోరీకి వచ్చిన దుండగులు జగిత్యాల జిల్లాకు చెందిన వారేనా లేక వేరే ఇతర ప్రాంతాలనుంచి వచ్చి ఇలా దోపిడికి పాల్పడ్డారా? అనేకోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Revanth Reddy: కొనసాగుతున్న రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో యాత్ర.. నేడు భూపాలపల్లి నియోజకవర్గంలో..