The Kerala Story: ఒక సినిమాపై ఒక వివాదం మొదలయింది అంటే.. ఆ సినిమాపై కలిగే ఇంట్రెస్ట్ అంతా ఇంతా కాదు. అసలు అందులో ఏముంది..? ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు..? ప్రభుత్వాలు కూడా వద్దు అంటున్నాయి అంటే.. ఆ కథ ఏంటో తెలుసుకోవాలని థియేటర్ కు పరుగులు పెడతారు.
Vivek Agnihotri: ‘‘ది కాశ్మీర్ ఫైల్స్’’ డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు పంపించారు. ఈ విషయాన్ని వివేక్ అగ్నిహోత్రి మంగళవారం తెలిపారు. అయితే ఈ లీగల్ నోలీసుపై తమకు ఎలాంటి సమాచారం లేదని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
The Kerala Story: దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న ‘కేరళ స్టోరీ’ విడుదలకు ముందే వివాదాస్పదం అయింది. గత శుక్రవారం దేశవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ సినిమాను తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు బ్యాన్ చేశాయి. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం ఈ సినిమాకు టాక్సును రద్దు చేసింది. ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చింది.
గత వారం రోజులుగా ఇండియాలో వినిపిస్తున్న ఒకే ఒక్క సినిమా పేరు ‘ది కేరళ స్టొరీ’. దేశం మొత్తం సంచలనం సృష్టిస్తున్న ఈ మూవీని ‘ది లాస్ట్ మాంక్’, ‘లక్నో టైమ్స్’ లాంటి సినిమాలని డైరెక్ట్ చేసిన ‘సుదిప్తో సేన్’ ది కేరళ స్టొరీ సినిమాని డైరెక్ట్ చేశాడు. అదా శర్మ, యోగిత బిహాని, సోనియా బలాని, సిద్ధి ఇద్నానీ ముఖ్యపాత్రల్లో నటించిన ది కేరళ స్టొరీ మే 5న రిలీజ్ అయ్యింది. “కేరళలో 32000 మంది…
RGV: సాధారణంగా రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు మాట్లాడతాడు అని అభిమానులను అడిగితే .. అయితే వోడ్కా తాగినప్పుడు, లేదా వివాదం చేయాలనుకున్నప్పుడు అని టక్కున చెప్పేస్తారు.సరే, మన దగ్గర వివాదాలు లేకపతే.. వివాదాలు ఉన్న సమస్యలపై స్పందిస్తే సరి.. అనుకొనే టైప్ వర్మ. ఈ మధ్యనే నిజం అనే యూట్యూబ్ ఛానెల్ తో దర్శనమిచ్చి.. అబద్దాలకు బట్టలు ఇప్పదీస్తా.. వివేకా హత్య కేసులో నిజానిజాలు బయటపెడతా అంటూ చెప్పుకొచ్చాడు.
వివాదాస్పదమైన ‘ది కేరళ స్టోరీ’ సినిమా కొత్త తరహా ఉగ్రవాదాన్ని బయటపెట్టిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బెంగళూరులో ఈ చిత్రాన్ని ఆయన ఆదివారం వీక్షించారు.
ది కేరళ స్టోరీ' చిత్రానికి సంబంధించిన పాజిటివ్ రివ్యూలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నందుకు రాజస్థాన్‌లో ఒక వ్యక్తిని కొట్టి, బెదిరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతను తన వాట్సాప్ స్టోరీలో సినిమా చూడాలని యువతులను ప్రోత్సహిస్తున్నాడు. ఈ కేసుకు సంబంధించి ఓ మైనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Adah Sharma: చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఎవరు స్టార్ అవుతారు చెప్పడం కష్టం. కొంతమంది మొదటి సినిమాతోనే స్టార్ అవుతారు.. ఇంకొంతమంది ఆ స్టార్ డమ్ ను అందుకోవడానికి ఏళ్ళు పడుతుంది.
The Kerala Story: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ ది కేరళ ఫైల్స్ ’ సినిమా ఈ శుక్రవారం విడుదలైంది. విడుదలతో పాటే వివాదాలను కూడా తీసుకువచ్చింది. ముఖ్యంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ సినిమాపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు మాత్రం ఈ సినిమాకు టాక్స్ ఫ్రీ కల్పించాయి. ఇదిలా ఉంటే శాంతిభద్రతల పరిస్థితి దృష్ట్యా తమిళనాడులోని మల్టీప్లెక్స్ థియేటర్లలో ఆదివారం నుంచి ఈ సినిమాను నిలిపివేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో రోడ్‌షో నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఓ వైపు మణిపూర్‌లో హింస చెలరేగి తగలబడుతుంటే.. జమ్మూకశ్మీర్‌లో సైనికులు చనిపోతుంటే ప్రధాని కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, రోడ్ షోలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.