Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
- పరోటా ఆరోగ్యానికి ఎందుకు హానికరం?
- మైదా, ట్రాన్స్ ఫ్యాట్స్‌తో పెరిగే ఆరోగ్య ముప్పు
- పరోటా తినేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు
- ఆరోగ్యంగా పరోటా తినేందుకు నిపుణుల సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala Parotta : దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా కేరళలో ‘పరోటా’కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మలయాళీలే కాకుండా మన తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఇతర ప్రాంతాల వారు కూడా దీని రుచికి ఫిదా అయిపోతుంటారు. అయితే, ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదనే ఆందోళన చాలా మందిలో ఉంటుంది. చరిత్ర ప్రకారం, ఈ పరోటా మొదట శ్రీలంక నుండి తమిళనాడుకు, ఆ తర్వాత కేరళకు విస్తరించింది. పూర్వ కాలంలో కఠినమైన శారీరక శ్రమ చేసే కార్మికులు తక్షణ శక్తి కోసం దీనిని తినేవారు. కానీ, నేటి ఆధునిక కాలంలో ఎలాంటి శారీరక శ్రమ లేకుండా కేవలం రుచి కోసం దీనిని ఎక్కువగా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నాం. ఇందులో కేలరీలు చాలా ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం.
పరోటా ఎందుకు ప్రమాదకరం?
పరోటా తయారీకి వాడే ముఖ్యమైన పదార్థం మైదా పిండి. అన్ని బేకరీ ఉత్పత్తుల్లో మైదా ఉన్నప్పటికీ, పరోటా మరింత హానికరంగా మారుతుంది. ఎందుకంటే మైదా పిండిని సాగదీసి పొరలు పొరలుగా చుట్టడానికి ‘ట్రాన్స్ ఫ్యాట్’ (వనస్పతి లేదా డాల్డా) లేదా ఎక్కువ మొత్తంలో నూనెను ఉపయోగిస్తారు.
Also Read
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
- Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
- Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
మైదాలో శరీరానికి కావలసిన పీచుపదార్థం (ఫైబర్) కానీ, ప్రోటీన్లు కానీ అస్సలు ఉండవు. ఇది కేవలం ఖాళీ కేలరీల నిధి. దీనిని తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు (Sugar Levels) అకస్మాత్తుగా పెరుగుతాయి. ఇది జీర్ణమవ్వడానికి చాలా సమయం పడుతుంది, దీనివల్ల గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.
సైజును బట్టి కేలరీల లెక్కలు
మన మార్కెట్లో పరోటాలు రకరకాల సైజుల్లో లభిస్తాయి. సాధారణ సైజు పరోటాతో పాటు ఇప్పుడు కాయిన్ (నాణెం) సైజు పరోటాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఒక సాధారణ పరోటా తయారీకి సుమారు 85 గ్రాముల మైదా పిండిని వాడతారు. దీని ద్వారా శరీరానికి దాదాపు 245 కేలరీలు వస్తాయి. అదే కాయిన్ పరోటా అయితే 45 గ్రాముల పిండితో చేస్తారు కాబట్టి కేలరీలు సగానికి తగ్గుతాయి.
పరోటాను చికెన్ వేపుడు, బీఫ్ ఫ్రై లేదా ఇతర మసాలా దట్టించిన వేపుళ్లతో కలిపి తిన్నప్పుడు శరీరంలోకి వెళ్లే కేలరీల శాతం రెట్టింపు అవుతుంది. దీనిని తరచూ ఇలాగే తింటూ ఉంటే మధుమేహం, ఫ్యాటీ లివర్, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం (బరువు పెరగడం) , శరీరంలో నీరు చేరి వాపులు రావడం (Edema) వంటి తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి.
పరోటా తినేటప్పుడు పాటించాల్సిన నియమాలు
సమయం చాలా ముఖ్యం: పరోటాను ఎప్పుడూ రాత్రిపూట లేదా సాయంత్రం 6 గంటల తర్వాత తినకూడదు. ఎందుకంటే ఆ సమయంలో శరీరం విశ్రాంతి స్థితికి చేరుకుంటుంది కాబట్టి జీర్ణక్రియ మందగిస్తుంది. పగటిపూట మనం చురుగ్గా ఉన్నప్పుడు మాత్రమే దీనిని తినాలి.
ఆకలితో ఉన్నప్పుడు వద్దు: బాగా ఆకలి వేస్తున్నప్పుడు కడుపు నింపుకోవడానికి పరోటాలను ప్లేట్లకు ప్లేట్లు లాగించేయకూడదు. ముందుగా వేరే ఏదైనా తేలికపాటి ఆహారం తిని, ఆకలి కొద్దిగా తగ్గాక రుచి కోసం మాత్రమే పరోటా తినాలి.
ఆరోగ్యకరంగా తినే మార్గం
పరోటాలో పీచుపదార్థం ఉండదు కాబట్టి, దానిని భర్తీ చేయడానికి పరోటాతో పాటు ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయలు, వెజిటబుల్ సలాడ్లు లేదా పీచుపదార్థం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలి. ఒక పరోటా తింటే కనీసం అర ఉల్లిపాయనైనా నంజుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇది జీర్ణక్రియకు సహాయపడి గ్యాస్ రాకుండా చూస్తుంది.
అలాగే, నూనె ఎక్కువగా ఉండే వేపుడు కూరలకు బదులుగా పల్చటి షేర్వా లేదా కుర్మా వంటి కూరలను ఎంచుకోవాలి. పరోటా ముక్క కంటే కూరను ఎక్కువగా నంజుకోవాలి. తినేటప్పుడు టీవీ లేదా ఫోన్ చూడకుండా, ప్రతి ముద్దను బాగా నమిలి పూర్తిగా లాలాజలంతో కలిసేలా తినాలి. ఇలా చేయడం వల్ల త్వరగా కడుపు నిండినట్లు అనిపించి ఎక్కువ తినకుండా ఉంటారు. పరోటా తిన్న తర్వాత కదలకుండా కూర్చోకుండా కనీసం ఓ పది నిమిషాల పాటు అటు ఇటు నడవడం మంచిది. వారానికి ఒక్క రోజు మాత్రమే, అది కూడా కేవలం ఒక కోరికగా (Cheat Meal) భావించి ఒకటి లేదా రెండు కాయిన్ పరోటాలతో ముగించడం ఆరోగ్యానికి క్షేమకరం.
తాజావార్తలు
-
The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
Sandeep Patil: రోహిత్, కోహ్లీ లేకపోయినా టీమిండియాకు నష్టమేమీ లేదు.. మాజీ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!