Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
- అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు
- అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి
- భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా ప్రభావం పడే అవకాశాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బతుకు బండిని నడపాలంటే పచ్చనోటు ఎంత ముఖ్యమో.. వాహనాలు నడవాలంటే ఇంధనం కూడా అంతే ముఖ్యం. కానీ ఇంధన కొరతతో వాహనాలు ముందుకు కదులుతాయా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రపంచ దేశాలు తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పైకి ఎగబాకుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న తాజా భౌగోళిక ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లను మరోసారి కలవరపెడుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా ప్రభావం పడే అవకాశాలపై చర్చ జరుగుతోంది.
ముడి చమురు ధరలు పెరుగుదల
బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో రెండు ప్రధాన ముడి చమురు బెంచ్‌మార్క్‌లు లాభాల్లో ట్రేడయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ధర సుమారు 1 శాతం పెరిగి బ్యారెల్‌కు 93 డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ముడి చమురు ధర బ్యారెల్‌కు 89 డాలర్లకు పెరిగింది. అయితే, జూన్ 9న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ధరలు కొంత మేర తగ్గాయి. కానీ ఆ తర్వాత జరిగిన తాజా సైనిక పరిణామాలు మార్కెట్లలో మళ్లీ ఆందోళనలను పెంచాయి.
Also Read
- LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఢిల్లీ ఆసుపత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
- Annamalai: తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త పార్టీ.. అన్నామలై కీలక ప్రకటన..
- Lawrence Bishnoi History: కాలేజ్ స్టూడెంట్ నుంచి గ్యాంగ్‌స్టర్ దాకా.. పోలీస్ కొడుకు లారెన్స్ బిష్ణోయ్ హిస్టరీ ఇదే..!
- Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కేవలం 45 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్..!
ఉద్రిక్తతలకు కారణం ఏమిటి?
ఇరాన్ ఒక అమెరికన్ అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేసిందన్న వార్తల నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీనికి ప్రతిస్పందనగా అమెరికా దక్షిణ ఇరాన్‌లోని కొన్ని వ్యూహాత్మక లక్ష్యాలపై వైమానిక దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈ పరిణామాలతో వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య కొనసాగుతున్న శాంతి చర్చలు, కాల్పుల విరమణ ప్రయత్నాలు సంక్షోభంలో పడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
హార్ముజ్ జలసంధిపై ఆందోళనలు
ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే హార్ముజ్ జలసంధి ప్రస్తుతం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మార్గం ద్వారా అధికభాగం ప్రపంచ చమురు రవాణా జరుగుతుంది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా ఈ ప్రాంతంలో నౌకాయాన కార్యకలాపాలపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ప్రపంచ మార్కెట్లలో చమురు సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా చమురు నిల్వలు తగ్గుదల
ఇదిలా ఉండగా, అమెరికా ముడి చమురు నిల్వలు వరుసగా ఎనిమిదో వారానికి కూడా తగ్గినట్లు అమెరికన్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్ (API) తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. జూన్ 5తో ముగిసిన వారంలో అమెరికా ముడి చమురు నిల్వలు 9.12 మిలియన్ బ్యారెళ్ల మేర తగ్గాయి. అదే సమయంలో గ్యాసోలిన్ నిల్వలు కూడా 1.19 మిలియన్ బ్యారెళ్లు క్షీణించాయి. ఈ పరిణామాలు ప్రపంచ మార్కెట్లో సరఫరాపై ఆందోళనలను మరింత పెంచి, ముడి చమురు ధరలకు మద్దతు ఇస్తున్నాయి.
భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం?
భారత్ తన చమురు అవసరాల్లో అధిక భాగాన్ని దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగితే, భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే తుది నిర్ణయం ప్రభుత్వ విధానాలు, పన్నులు, చమురు మార్కెటింగ్ కంపెనీల ధరల సమీక్షలపై ఆధారపడి ఉంటుంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
ట్రెండింగ్
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!