The Kerala Story: ఒక సినిమాపై ఒక వివాదం మొదలయింది అంటే.. ఆ సినిమాపై కలిగే ఇంట్రెస్ట్ అంతా ఇంతా కాదు. అసలు అందులో ఏముంది..? ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు..? ప్రభుత్వాలు కూడా వద్దు అంటున్నాయి అంటే.. ఆ కథ ఏంటో తెలుసుకోవాలని థియేటర్ కు పరుగులు పెడతారు. ఇక థియేటర్ లో మిస్ అయినవారు ఓటిటీకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. ప్రస్తుతం తమిళనాడును గజగజలాడిస్తున్న చిత్రం ది కేరళ స్టోరీ. అదాశర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించాడు. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ చిత్రం తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వమే ఈ సినిమాను బ్యాన్ చేయించి, కొన్ని థియేటర్ లో షోలను క్యాన్సిల్ కూడా చేయించింది.
Rashmika: ఓ.. పాప.. ముందు వెనుక చూసుకోవాలిగా.. ఇప్పుడు అడ్డంగా దొరికావ్
కేరళలో 32 వేలమంది యువతులు కనిపించకుండా పోయినా కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదని ఒక ఆరోపణ ఉంది. అదే ఈ సినిమా.. అందుకే ఈ సినిమాను రాజకీయ నాయకులు సపోర్ట్ చేయడం లేదు. ఇక ఒక్క తమిళనాడులో తప్ప మిగిలిన అన్నిచోట్ల ఈ చిత్రం రికార్డు కలక్షన్స్ రాబడుతుంది. ఇక ఈ సినిమా గురించిన ఒక తాజా అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా డిజిటల్ పార్ట్నర్ ఎవరో తెలిసిపోయింది. ది కేరళ స్టోరీ ఓటిటీ హక్కులను జీ 5 సొంతం చేసుకున్నది. అయితే ఇప్పుడప్పుడే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయడానికి లేదు.. సినిమా మంచి హిట్ అందుకోవడంతో దాదాపు రెండు నెలల వరకు ఓటిటీకి వచ్చే ఛాన్స్ లేదంటున్నారు. ఒకవేళ.. సినిమాపై వివాదాలు పెరిగితే.. త్వరగానే ఓటిటీ లో వచ్చే అవకాశం ఉంది. దీని గురించి పూర్తిగా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.