The Kerala Story: వివాదాలకు కేంద్రబిందువుగా నిలుస్తోంది ‘ది కేరళ స్టోరీ’ సినిమా. ఇప్పటికే ఈ సినిమాపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ సినిమా విడుదల చేయకుండా స్టే ఇవ్వాలని పలువురు సుప్రీంకోర్టు, కేరళ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ..కోర్టులు అందుకు నిరాకరించాయి. దీంతో శుక్రవారం దేశవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద భద్రతను కల్పించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు టాక్స్ ఫ్రీ ప్రకటించింది.
The Kerala Story : ‘ది కేరళ స్టోరీ’ సినిమా నిన్న(శుక్రవారం) మే 5న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి వివాదాలు చెలరేగడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు ఎలా రెస్పాండ్ అవుతారని అందరి దృష్టి నెలకొంది.
The Kerala Story: సంచలనాలకు కేంద్రబిందువుగా మారిని ‘‘ ది కేరళ స్టోరీ ’’ సినిమాపై స్టే ఇచ్చేందుకు కేరళ హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఈ సినిమా సెన్సార్ షిప్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ ను ఈ రోజు విచారించింది. ఇప్పటికే ఈ సినిమాపై సుప్రీంకోర్టు కూడా స్టేకు నిరాకరించింది.
The Kerala Story: ది కేరళ స్టోరీ సినిమా చుట్టూ వివాదాలు ముసురుతూనే ఉన్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యినప్పటినుంచి సినిమాను నిలిపివేయాలంటూ కేరళ ప్రజలు, ప్రభుత్వం పోరాడుతూనే ఉన్నారు.
The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేరళలో జరుగుతున్న బలవంతపు మతమార్పిడులు ఇతివృత్తంగా సినిమాను రూపొందించినట్లు మూవీ మేకర్స్ వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉంటే సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఈ సినిమా హిందూ-ముస్లింల వైషమ్యాలు, సెక్యులరిజానికి వ్యతిరేకంగా ఉందని దీన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కేరళ సీఎం పినరయి విజయన్ ఏకంగా.. ఈ సినిమాను ఆర్ఎస్ఎస్, బీజేపీ అబద్ధపు ప్రచారంగా అభివర్ణించారు.
The Kerala Story: ‘‘ ది కేరళ స్టోరీ’’ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీన్ని ఆపాలంటూ పలువురు సుప్రీంకోర్టు తలుపు తడుతున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్ తో పాటు పలు ముస్లిం సంఘాలు, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు సినిమాపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతలా వ్యతిరేకతకు కారణం ఏమిటని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు.
The Kerala Story: దేశవ్యాప్తంగా ప్రస్తుతం ‘ది కేరళ స్టోరీ’ సినిమా సంచలనంగా మారుతోంది. ఈ సినిమాను బ్యాన్ చేయాలని పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంకా చేస్తున్నారు. శుక్రవారం రోజున హిందీ, తెలుగు, తమిళ్, మళయాళం భాషల్లో సినిమా విడుదల కాబోతోంది.
మే మొదటి వారాంతంలో అనువాద చిత్రాలతో కలిపి ఏడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటిలో అందరి దృష్టి గోపీచంద్ 'రామబాణం', నరేశ్ 'ఉగ్రం' సినిమాలపైనే అధికంగా ఉంది.
మే 5న విడుదలవుతున్న 'ది కేరళ స్టోరీ' చిత్రానికి వ్యతిరేకంగా కేరళలో నిరసనలు తీవ్రమవుతున్నాయి. సీపీఐ(ఎం), కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకులు ఈ చిత్రాన్ని "ప్రచార చిత్రం" అని తీవ్రంగా విమర్శించారు.సోమవారం 'ది కేరళ స్టోరీ' మద్దతుదారులకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) యువజన విభాగం అయిన ముస్లిం యూత్ లీగ్ ఒక సవాల్‌ను విసిరింది.