Adah Sharma: చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఎవరు స్టార్ అవుతారు చెప్పడం కష్టం. కొంతమంది మొదటి సినిమాతోనే స్టార్ అవుతారు.. ఇంకొంతమంది ఆ స్టార్ డమ్ ను అందుకోవడానికి ఏళ్ళు పడుతుంది. అది హీరో అయినా, హీరోయిన్ అయినా,.. కానీ నిరంతరం పోరాడే వారు మాత్రమే ఆ స్టార్ డమ్ ను దక్కించుకోగలరు. ఇక అలా పోరాడి ఇన్నాళ్ల తరువాత ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ అదా శర్మ. పూరి హీరోయిన్ గా హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ అదా శర్మ. మొదటి సినిమాలోఅమ్మడి అందానికి ఫిదా అయిపోయిన అభిమానులు త్వరలోనే ఈ చిన్నది టాలీవుడ్ ను ఏలేస్తుంది అని అనుకున్నారు. కానీ, ఈ సినిమా ఇచ్చిన పరాజయం.. అమ్మడికి సెకండ్ హీరోయిన్ ఛాన్స్ లను అందించింది.
సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇక ఈ రెండు సినిమాల తరువాత అదాను జనాలు గుర్తుపెట్టుకొనేలా చేసిన ఒక్కటి కూడా లేదు. దీంతో ఈ చిన్నది.. బాలీవుడ్ కు చేరిపోయింది. అక్కడ కమాండో అనే సినిమాలో సూపర్ కమాండో గా మంచి గుర్తింపుని తెచ్చుకుంది.. కానీ అవకాశాలను మాత్రంఅందుకోలేకపోయింది . ఇక అప్పుడప్పుడు వెబ్ సిరీస్ లు చేస్తూ కెరీర్ ను నెట్టుకొస్తున్న ఈచిన్నదాన్నీ జీవితాన్ని మార్చేసింది ది కేరళ స్టోరీ. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన ఈ సినిమాలో అదానే ప్రధాన పాత్రధారి. కేరళ కుట్టిగా నర్స్ అవ్వడానికి వెళ్లి తీవ్రవాదిగా బయటికి వచ్చి, తన లాంటి యువతులను ఉగ్రవాదులు ఎలాంటి హింసలు పెట్టారో కళ్ళకు కట్టినట్లుచూపించింది.
లంగా ఓణీ కట్టి కేరళ కుట్టిగా అలరించినా, ముఖానికి బుర్కా ధరించి.. తీవ్రవాదుల చేతుల్లో నలిగిపోయి, తన కన్నీళ్లను బుర్కా వెనుక దిగమింగి పోరాడిన వీరమహిళగా దైర్యం చూపించినా ఆమెకే చెల్లింది. ప్రస్తుతం ది కేరళ స్టోరీ అంటే అదా.. అదా అంటే కేరళ స్టోరీ. ఈ ఒక్క సినిమా ఆమె కెరీర్ ను మార్చేసింది అని చెప్పొచ్చు. ఈ సినిమా తరువాత లేడి ఓరియెంటెడ్ సినిమాలకు అదా కూడా బెస్ట్ ఛాయిస్ అనిపించుకొంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. మరి ఈ సినిమా ఇచ్చిన జోష్ తో అదా ముందు ముందు ఎలాంటి ప్రాజెక్ట్ లను ఎన్నుకొని ఏ రేంజ్ లో ఈ స్టార్ డమ్ ను నిలబెట్టుకొంటుందో చూడాలి.