Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ceiling Fan: వేసవికాలంలో ఇంట్లో చల్లదనాన్ని అందించే ప్రధానమైన వాటిలో సీలింగ్ ఫ్యాన్ ఒకటి. చాలా ఇళ్లలో ఎయిర్ కండీషనర్ లేదా కూలర్ లేకపోయినా, ఫ్యాన్ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఫ్యాన్‌ను అత్యధిక స్పీడ్‌లో పెట్టినా గాలి సరిగా రాకపోవడం, నెమ్మదిగా తిరగడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది వెంటనే కొత్త ఫ్యాన్ కొనాలని ఆలోచిస్తారు. కానీ, అంతకు ముందు కొన్ని సాధారణ విషయాలు పరిశీలిస్తే మీ పాత ఫ్యాన్ మళ్లీ కొత్తదిలా పనిచేసే అవకాశం ఉంది. మరి అవేంటో చూద్దామా..
కెపాసిటర్ చెక్:
ఫ్యాన్ స్పీడ్ తగ్గడానికి ప్రధాన కారణాల్లో కెపాసిటర్ ఒకటి. ఫ్యాన్ ప్రారంభం కావడానికి, పూర్తి వేగంతో తిరగడానికి ఇది సహాయపడుతుంది. కాలక్రమేణా కెపాసిటర్ బలహీనపడితే ఫ్యాన్ నెమ్మదిగా తిరగడం ప్రారంభిస్తుంది. సాధారణంగా 2.5 µF కెపాసిటర్‌ను మార్చడం ద్వారా సమస్య పరిష్కారమవుతుంది. ఇది తక్కువ ఖర్చుతో సులభంగా అందుబాటులో ఉంటుంది.
Also Read
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
రెగ్యులేటర్ లోపం:
కొన్నిసార్లు సమస్య ఫ్యాన్‌లో కాకుండా రెగ్యులేటర్‌లో ఉండవచ్చు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్లు దెబ్బతింటే ఫ్యాన్‌కు సరైన వోల్టేజ్ అందదు. దీంతో ఫ్యాన్ పూర్తి వేగంతో పనిచేయదు. కాబట్టి ఫ్యాన్ స్పీడ్ తగ్గితే రెగ్యులేటర్‌ను కూడా ఒకసారి పరిశీలించడం మంచిది.
ఫ్యాన్ బ్లేడ్లను శుభ్రం చేయడం:
ఫ్యాన్ బ్లేడ్లపై పేరుకుపోయే దుమ్ము, ధూళి కూడా స్పీడ్ తగ్గడానికి కారణమవుతుంది. బ్లేడ్లు బరువుగా మారడంతో మోటార్‌పై అదనపు ఒత్తిడి పడుతుంది. అలాగే గాలి ప్రసరణ కూడా తగ్గిపోతుంది. కాబట్టి నెలకు కనీసం ఒకసారి ఫ్యాన్ బ్లేడ్లను శుభ్రం చేయడం అవసరం.
బ్లేడ్లు సరిగా ఉన్నాయో లేదో పరిశీలన:
ఫ్యాన్ బ్లేడ్లు వంగిపోవడం లేదా అసమానంగా ఉండటం వల్ల కూడా గాలి సరిగా రాదు. శుభ్రం చేసే సమయంలో లేదా మరమ్మతుల సమయంలో బ్లేడ్లు కొద్దిగా వంగిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యాన్ సమతుల్యత కోల్పోయి పనితీరు తగ్గుతుంది. కాబట్టి బ్లేడ్లు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించండి.
బేరింగ్స్‌కు లూబ్రికేషన్:
ఫ్యాన్ నుంచి కీచుమనే శబ్దాలు వస్తుంటే బేరింగ్స్ పొడిగా మారి ఉండవచ్చు. సరైన లూబ్రికేషన్ లేకపోతే మోటార్‌పై భారం పెరిగి స్పీడ్ తగ్గుతుంది. కొద్దిగా ఆయిల్ వేయడం ద్వారా సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అయితే బేరింగ్స్ పూర్తిగా దెబ్బతిన్నట్లయితే ఎలక్ట్రిషియన్ సహాయం తీసుకోవాలి.
ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతుందని వెంటనే కొత్తది కొనాల్సిన అవసరం లేదు. కెపాసిటర్ మార్చడం, రెగ్యులేటర్‌ను చెక్ చేయడం, బ్లేడ్లను శుభ్రం చేయడం, బేరింగ్స్‌కు ఆయిల్ వేయడం వంటి చిన్నచిన్న నిర్వహణ చర్యలతో ఫ్యాన్ పనితీరును తిరిగి మెరుగుపరచవచ్చు. కొద్దిపాటి ఖర్చుతోనే మీ పాత ఫ్యాన్‌ను మరికొన్ని సంవత్సరాలు సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!