తమ సిబ్బందిపై దాడులకు పాల్పడితే ఎంతటి వారికైనా చట్టపరమైన చర్యలు తప్పవని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. పోలీస్ శాఖ సహకారంతో బాధ్యులపై రౌడీ షీట్స్ తెరుస్తామని ఆయన స్పష్టం చేశారు. దుండగుల చేతిలో దాడికి గురై తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బండ్లగూడ డిపో డ్రైవర్ విద్యా సాగర్ ను వీసీ సజ్జనార్ సోమవారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును ఆయనను అడిగి తెలుసుకున్నారు. Also Read:Mani Ratnam:…
తొలి మహిళా కండక్టర్లను టీజీఎస్ ఆర్టీసీ సన్మానించింది. ఆర్టీసీలో తొలి మహిళా కండక్టర్లుగా విధుల్లో చేరి 28 ఏళ్ల ఉత్తమ సర్వీసును పూర్తి చేసుకున్న ముగ్గురిని యాజమాన్యం అభినందించింది. హైదరాబాద్ బస్ భవన్‌లో దిల్‌సుఖ్‌నగర్ డిపోనకు చెందిన శ్రీదేవి, అనిత, మెహిదిపట్నం డిపోకు చెందిన శారదను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ సన్మానించారు.
పాములన్నాక చెట్లు, పుట్టల వెంట తిరుగుతుంటాయి. ఇటీవల జనావాసాల్లోకి వచ్చి హల చల్ చేస్తున్నాయి. ఇదే విధంగా నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపైకి ఓ నాగుపాము వచ్చింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆ పామును గమనించాడు. దాన్ని ఎలాగైనా కాపాడాలని అనుకున్నాడు. ఈ ప్రయత్నంలో పాము గేర్ బాక్సులోకి చొరబడింది. ఆ తర్వాత స్థానిక యువకుల సాయంతో పామును బయటకు తీసి చంపారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. Read…
టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. నిబద్దతతో పని చేస్తూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తోన్న ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం ప్రాధాన్యం ఇస్తోంది అన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లింపు, 21 శాతం ఫిట్మెంట్ తో 2017 పీఆర్సీ, 2013 ఆర్పీఎస్ బాండ్ల డబ్బుల విడుదలతో పాటు పెండింగ్ డీఏలను మంజూరు చేసిందని గుర్తు చేశారు.
VC Sajjanar : హైదరాబాద్ మహానగరంలో రోడ్డుప్రమాదాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో తరచూ వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్న నేపథ్యంలో, ట్రాఫిక్ పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ వాహనదారుడు బైక్పై తీవ్ర నిర్లక్ష్యంతో ప్రయాణిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫోటోను చూస్తే, వ్యక్తి బైక్పై పెద్ద పెద్ద మూటలు కట్టుకొని, ఆ మూటల మధ్య ఓ మహిళను వెనుక కూర్చోబెట్టుకుని ప్రయాణిస్తున్నాడు.…
మినిస్టర్ క్వార్టర్స్ లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఆర్టీసీ సంఘాల నేతలు కలిశారు. ఆర్టీసీ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి పొన్నం ఆర్టీసీ సమస్యలపై ఆర్టీసీ సంక్షేమం కోరే ఎవరైనా ఈరోజు, రేపు ఎప్పుడైనా కలిసి సమస్యలు చెప్పుకోవచ్చు మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటానని తెలిపారు. ఆర్టీసీ సమస్యలు వినడానికి నేను కానీ మా ముఖ్యమంత్రి కార్యాలయం తలుపులు కూడా ఎప్పుడూ తెరిచే ఉంటాయని తెలిపారు.…
తెలంగాణలో ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగించేందుకు కార్మికులు రెడీ అయ్యారు. ఈ నెల 07 నుంచి సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధం అని తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండు పరిసరాలను సందర్శించి, ప్రయాణికులతో ముచ్చటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధం, సీఎం ఆదేశాల మేరకు 5, 6 తేదీల్లో కార్మికులు ఎప్పుడు వచ్చినా…
Telangana CM: మే డే వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు.. కార్మికులు సమ్మె ఆలోచన వీడండి అని కోరారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది.. ఇది మీ సంస్థ.. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ కార్మికులపైనే ఉంది అన్నారు.
TGSRTC Strike: తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఉద్యోగుల డిమాండ్లపై రాష్ట్ర కాంగ్రెస్ స్పందించకపోవడంతో మే 7వ తేదీ నుండి నిరవధిక సమ్మె చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు (JAC) నిర్ణయించాయి. ఈ సందర్బంగా సమ్మె సంబంధించిన పోస్టర్ ను ఆర్టీసీ కార్మిక జేఏసీ ఆవిష్కరించింది. మే డే స్పూర్తితో ఆర్టిసి సమ్మెకు సిద్దం అయ్యింది జేఏసీ. ఇప్పటికైన అయిన ప్రభుత్వం స్పందించి సమస్యల నివారణకు చర్యలు చేపట్టాలని, మా న్యాయమైన డిమాండ్ ల…
Ponnam Prabhakar: తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తుండడంతో హర్షం వ్యక్తం చేశారు.