పాములన్నాక చెట్లు, పుట్టల వెంట తిరుగుతుంటాయి. ఇటీవల జనావాసాల్లోకి వచ్చి హల చల్ చేస్తున్నాయి. ఇదే విధంగా నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపైకి ఓ నాగుపాము వచ్చింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆ పామును గమనించాడు. దాన్ని ఎలాగైనా కాపాడాలని అనుకున్నాడు. ఈ ప్రయత్నంలో పాము గేర్ బాక్సులోకి చొరబడింది. ఆ తర్వాత స్థానిక యువకుల సాయంతో పామును బయటకు తీసి చంపారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
Read Also: KTR : భారతదేశ చరిత్రలో అత్యంత విజయవంతమైన స్టార్టప్ స్టేట్‌గా తెలంగాణ నిలిచింది
కరీంనగర్ నుంచి జగిత్యాలకు వస్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు ముందు జగిత్యాల పాల కేంద్రం వద్ద రోడ్డుపై వెళుతున్న నాగుపాము డ్రైవర్ కు కనిపించింది. పామును రక్షించేందుకు బస్సు ఆపాడు డ్రైవర్. నడి రోడ్డుపై కావడంతో పాము ఎటు వెళ్లలేక బస్సు ఇంజన్ గేర్ బాక్స్ లో చొరబడింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు బస్సు దిగి పరుగులు పెట్టారు. రోడ్డు వెంట వెళ్తున్న స్థానిక యువకులు గేర్ బాక్స్ లో ఉన్న పామును బయటకు తీసి చంపారు. బస్సు అక్కడినుండి వెళ్ళిపోగా.. బస్సు నడిరోడ్డుపై ఆగడంతో అర్ధగంటపైగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. పాపం పామును చంపకూడదని బస్సు డ్రైవర్ చేసిన ప్రయత్నం విఫలం కాగా.. నాగసర్పం స్థానికుల చేతిలో చనిపోయింది.