రోజూ ఫుడ్ కు బదులు ఇంజిన్ ఆయిల్ తాగుతున్న వ్యక్తి.. వీడియో వైరల్
కర్ణాటకలో సాధువు రూపంలో నివసిస్తున్న ఆయిల్ కుమార్ అనే వ్యక్తి ఎటువంటి ఆహరం తీసుకోకుండా కేవలం ఇంజన్ ఆయిల్ మాత్రమే తాగుతూ జీవిస్తున్నాడు.. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించే విషయం.. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి తాను ఆహారం లేకుండా జీవిస్తున్నానని, అన్నం, చపాతీకి బదులుగా 7-8 లీటర్ల వేస్ట్ ఇంజిన్ ఆయిల్ మరియు టీ మాత్రమే తాగుతున్నానని ఆయన చెబుతున్నాడు. దీంతో ఆయన ప్రపంచ ఆరోగ్య నిపుణులకు ఒక రహస్యమైన కేస్ స్టడీగా మారాడు. వైద్యులు, శాస్త్రవేత్తలు అతని మాటలు, జీవనశైలిని చూసి షాక్ అయ్యారు. 33 ఏళ్ల ఆ వ్యక్తి ఇప్పటికీ ఫిట్‌గా ఉండటానికి గల కారణాన్ని స్పష్టం చేయలేకపోతున్నారు. కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన ఆయిల్ కుమార్‌గా స్థానికంగా ఫేమస్ అయిపోయారు. అయ్యప్ప ఆశీస్సుల వల్లే ఈ ప్రత్యేకమైన జీవనశైలి సాధ్యమవుతుందని అన్నారు.
మా కొత్త నగరం పేరు ‘భారత్ ఫ్యూచర్’ సిటీ!
హైదరాబాద్ సమీపంలో కొత్త నగరాన్ని నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 9 వర్టికల్ రంగాలకు ప్రత్యేకంగా న్యూసిటీ నిర్మాణం ఉంటుందని, కొత్త నగరం పేరు ‘భారత్ ఫ్యూచర్’ సిటీ అని చెప్పారు. భవిష్యత్ తరాలకు అవకాశాలను క్రియేట్ చేయడం తమ ప్రభుత్వం లక్ష్యం అని చెప్పారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా.. హైదరాబాద్‌కు ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తన డ్రీమ్ అని, మహాత్మా గాంధీ యంగ్ ఇండియా పేరుతో ఇచ్చిన స్ఫూర్తిని తాను ఫాలో అవుతాను ఐ సీఎం చెప్పారు. పెట్టుబడులే లక్ష్యంగా ఢిల్లీలో పబ్లిక్ ఎఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా 12వ వార్షిక సదస్సుకు సీఎం రేవంత్ హాజరయ్యారు.
కాంతార 2 ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం పెట్టేసారు.. రెడీగా ఉండండి
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టిని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన ఫిల్మ్ కాంతార. జీరో ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చిన ఈ సినిమా శాండిల్ వుడ్ టాప్ 5 హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్స్‌లో ఒకటిగా నిలిచింది. రూ. 14 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుతో కాంతారా చాప్టర్ వన్ ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను అత్యంత ప్రెస్టిజియస్ ప్రాజెక్టుగా టేకప్ చేసిన రిషబ్ శెట్టి.. ఎన్ని సమస్యలొచ్చినా అధిగమించి.. చెప్పిన టైంకి మూవీని దించేస్తున్నాడు. అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజౌతుంది కాంతార ప్రీక్వెల్.
ప్లాస్టిక్ నిరోధానికి మూలాలపై దృష్టి.. పర్యావరణ పరిరక్షణకు సహకారం..
ప్లాస్టిక్ నిరోధానికి మూలాలపై దృష్టి పెట్టాలి.. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందిస్తున్నాం అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్లాస్టిక్ వినియోగంపై అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. ప్లాస్టిక్ వల్ల వచ్చే కాలుష్యం పై వివరించారు.. ప్లాస్టిక్ ఉత్పత్తులు అరికట్టాలని అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం.. సచివాలయం మొత్తం ప్లాస్టిక్ నిలిపి వేశాం.. గాజు సీసాల్లో సచివాలయంలో నీటి సౌకర్యం ఏర్పాటు చేశాం అన్నారు.. ప్లాస్టిక్ రీ సైక్లింగ్ యూనిట్స్ ఏర్పాటు చేస్తున్నాం.. ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహిస్తున్నాం.. ప్రజలకి సంపూర్ణ అవగాహన కల్పించాలి అని పిలుపునిచ్చారు..
పార్టీ మార్పుపై మరోసారి స్పందించిన రాజగోపాల్ రెడ్డి.. ఏమన్నారంటే..?
ఈ మధ్య వరుసగా సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీ వెళ్లడంతో.. పెద్ద ప్రచారమే తెరపైకి వచ్చింది.. ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తారని.. ఏపీ పర్యటనలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో భేటీ అవుతున్నారని.. ఇక పార్టీ మారుడే మిగిలిందనే ప్రచారం జోరుగా సాగుతూ వచ్చింది.. అయితే, ఆ వార్తలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి.. విజయవాడ కనక దుర్గమ్మ సాక్షిగా తనపై వస్తున్న తప్పుడు కథనాలను దుష్ప్రచారాలను మరోసారి తీవ్రంగా ఖండించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి..
అయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం.. సీబీఐకి కోర్టు నోటీసులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థి అయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. అయేషా మీరా హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి నోటీసులు జారీ చేసింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. కేసుకి సంబంధించి సీబీఐ నివేదిక తమకు ఇవ్వాలని కోరుతూ ఆయేషా మీరా తండ్రి ఇక్బాల్ పాషా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమకు నివేదిక ఇవ్వకుండా అభ్యంతరాలను ఎలా తెలియజేస్తామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. ఈ కేసు హైకోర్టులో విచారణ దశలో ఉందని.. అది తేలాల్సి ఉందని జడ్జి అన్నారు. అయితే, ఈ కేసులో సీబీఐకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేశారు..
ఐక్యరాజ్యసమితిలో పాక్‌కు ఎదురుదెబ్బ.. చైనాకు తప్పని భంగపాటు
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో పాకిస్థాన్, చైనాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు దేశాలు కూడా భంగపాటుకు గురి అయ్యాయి. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA), దాని ఆత్మాహుతి దళం, మజీద్ బ్రిగేడ్‌ను UN 1267 ఆంక్షల జాబితాలో చేర్చాలని పాక్, చైనాలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో ప్రతిపాదించాయి. అయితే ఈ ప్రతిపాదనను US, UK, ఫ్రాన్స్ అడ్డుకున్నాయి. ఈ దేశాలు BLA, మజీద్ బ్రిగేడ్‌లను అల్-ఖైదా లేదా ISILతో చేర్చడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొన్నాయి. దీంతో పాక్, చైనాల ఉమ్మడి తీర్మానం ఆమోదం పొందడంలో విఫలమైంది.
వైఎస్ వివేకానంద హత్యపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.. హత్య జరిగిందని అందరికీ తెలుసు.. కానీ..
మాజీ రాష్ట్ర మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి 2019 మార్చి 15 తెల్లవారేసరికల్లా పులివెందులలోని తన స్వంత ఇంట్లో అనుమానాస్పద రీతిలో మరణించిన విషయం తెలిసిందే. మొదట గుండెపోటు కారణంగా మరణించాడని నివేదికలు వచ్చినా, క్రమేపీ వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడన్న విషయం సంచలనం సృష్టించింది. ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. తాజాగా వివేకా హత్యపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హత్య జరిగిందని అందరికీ తెలుసు అని అన్నారు. మన కళ్లముందే హత్య జరిగినా కేసును ఏం చేయలేకపోతున్నాం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వైఎస్ వివేకా హత్య కేసు మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
అమ్మాయిలను ఈడ్చిపడేసిన సుమన్ శెట్టి.. ఇలా అయ్యావేంటయ్యా..
సుమన్ శెట్టి రెచ్చిపోయాడు. తనలోని ఇన్నోసెంట్ ను పక్కన పెట్టేసి తడాఖా చూపించాడు. మనకు తెలిసిందే కదా.. మొన్నటి ఎపిసోడ్ లో డిమాన్ పవన్ సుమన్ శెట్టిని లాగి పడేశాడు. కానీ నిన్నటి ఎపిసోడ్ లో సుమన్ శెట్టి రెచ్చిపోయాడు. ఈ టాస్క్ లో టెన్నెంట్స్ కు ఓనర్లు అయ్యే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఓనర్లు అయిన మనీష్, ప్రియ విసిరే బొమ్మలను పట్టుకుని బాస్కెట్ లో వేసుకోవాలి. ఫైనల్ బజర్ వరకు వచ్చేసరికి ఎవరి బాస్కెట్ లో ఎక్కువ బొమ్మలు ఉంటే వారే విన్నర్. బొమ్మలను పట్టుకున్న వారు బాస్కెట్ లో వేసుకున్నారు. ఈ గ్యాప్ లో బొమ్మలను దొంగిలించే పని షురూ చేశారు. ఇమ్మాన్యుయెల్, ఫ్లోరా కలిసి రీతూను కిందపడేశారు. ఇక సుమన్ ను కిందపడేయడానికి ఫ్లోరా ట్రై చేస్తే.. మనోడు ఈడ్చి పడేశాడు. దాంతో ఆమె కింద పడిపోయింది.
బస్సు ఛార్జీల పెంపు వెనుక అసలు విషయం చెప్పిన ఆర్టీసీ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) తమ బస్సు టికెట్ ధరలను 50 శాతం పెంచిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, ఈ వార్తలను ఖండించింది. సాధారణ ప్రయాణికులకు వర్తించే టికెట్ చార్జీలు యథాతథంగా ఉన్నాయని సంస్థ వెల్లడించింది. ఈ ధరల పెంపు కేవలం ప్రత్యేక బస్సు సర్వీసులకు మాత్రమే వర్తిస్తుందని టీజీఎస్ఆర్టీసీ పేర్కొంది. ముఖ్యంగా పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నడిపే ప్రత్యేక బస్సు సర్వీసులలో మాత్రమే ధరల సవరణ ఉంటుందని తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసులలో, ప్రయాణికులను తీసుకెళ్లిన తర్వాత ఖాళీగా తిరిగి వచ్చే బస్సుల డీజిల్ ఖర్చులను భరించేందుకు మాత్రమే ఈ ధరలను పెంచుతారని వివరించారు. ఈ నిబంధనలు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 16 ప్రకారం 2003 నుంచి అమలులో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.