ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన తర్వాత సీట్లు దొరకడం లేదని మహిళలు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎదుట వాపోయారు. మునుగోడు వద్ద ఆర్టిసీ బస్సు ఎక్కిన రాజగోపాల్ రెడ్డి మహిళలను పలకరించారు.. ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డి మహిళల మధ్య ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పై ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన తర్వాత బస్సులో ప్రయాణించే మహిళల సంఖ్య పెరిగిందని…. ఫ్రీ బస్సు సౌకర్యం కంటే ముందు…
పోటీకి వైసీపీ దూరం.. పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీ..! గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. భారీ విజయాన్ని అందుకున్నారు.. ఇక, జనసేన ప్రభుత్వంలో కీలకభూమిక పోషిస్తుండగా.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు అప్పగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అయితే, ఇప్పుడు పిఠాపురంలో జరుగుతోన్న ఓ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీకి దూరంగా ఉండగా..…
దసరా పండుగను పురస్కరించుకుని, టీజీఎస్ఆర్టీసీ (తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) 6,000 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనుంది. ఈ ప్రత్యేక బస్సులు ప్రస్తుత ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు, వివిధ ప్రాంతాలకు మరింత సౌకర్యంగా ప్రయాణం చేసేందుకు సర్వసాధారణమైన మార్గాల్లో నడుపుతారు. ప్రయాణికులు ఆన్‌లైన్ లేదా బస్సు స్టేషన్‌ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక సేవలు దసరా సమయంలో అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటాయి, తద్వారా వారు ఈ పండుగను సుఖంగా జరుపుకోగలుగుతారు. Drinking…
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) ఇకపై బస్ టిక్కెట్‌లకు క్యూఆర్ కోడ్ చెల్లింపులను ఆమోదించనున్నట్లు ప్రకటించింది. ఈ చర్య ప్రయాణీకుల సౌకర్యాన్ని మెరుగుపరచడం , చెల్లింపు ప్రక్రియను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. నివేదికల ప్రకారం, PhonePe, Google Pay , క్రెడిట్ , డెబిట్ కార్డ్‌లతో సహా వివిధ డిజిటల్ చెల్లింపు పద్ధతులను అనుమతించే వ్యవస్థను అమలు చేయాలని TSRTC మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశించారు. ప్రయాణీకులు వారి మొబైల్ పరికరాల నుండి నేరుగా చెల్లింపులు…
తమ డిపోలను ప్రైవేట్‌పరం చేస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) యాజమాన్యం స్పష్టం చేసింది. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా కొందరు చేస్తోన్న ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారమే పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి సంస్థ తీసుకువస్తోందని పేర్కొంది. డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులతో సహా అన్ని బస్సుల ఆపరేషన్స్ నిర్వహణ పూర్తిగా టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని, అందులో ఎలాంటి…
టీజీఎస్ఆర్టీసీ బస్సులో ఫిట్స్ వచ్చిన ప్రయాణికుడిని ఆస్పత్రిలో చేర్పించి డ్రైవర్ ఉదారత చాటుకున్నారు. బస్సును నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రయాణికుడి ప్రాణాలను కాపాడారు. వరంగల్-2 డిపోనకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు హైదరాబాద్ నుంచి హన్మకొండకు సోమవారం వెళ్తోంది. హైదరాబాద్ శివారు ఘట్ కేసర్ దాటగానే సంతోష్ అనే ప్రయాణికుడికి బస్సులో ఒక్కసారిగా ఫిట్స్ వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన తోటి ప్రయాణికులు డ్రైవర్ బి.వెంకన్న దృష్టికి తీసుకెళ్లారు. వెంటేనే బస్సును పక్కకి ఆపి ఫిట్స్ వచ్చిన…
కొన్ని కొన్ని సార్లు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. కొందరు క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తరువాత బాధపడుతుంటారు. అలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. బస్సు కోసం వెయిట్ చేస్తోంది ఓ మహిళ. అయితే.. అదే సమయానికి ఓ ఆర్టీసీ బస్సు వచ్చింది కాని.. ఆమె ఉన్న చోట ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో కోపంతో అందుబాటులో ఉన్న బీర్ బాటిల్‌ను బస్సుపైకి రువ్వింది. ఆ మహిళ విసిరిన బీర్ బాటిల్ బస్సు వెనుక భాగంలోని…
గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ లో భాగంగా ఆర్టీసీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు కూడా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించిందని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు. ఆగస్టులో వైద్య పరీక్షలను ప్రారంభించి వారి హెల్త్ ప్రొఫైల్స్ ని రూపొందించేలా సంస్థ ప్లాన్ చేస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళా భవన్ లో మంగళవారం రాష్ట్రస్థాయి హెల్త్ వలంటీర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ…