VC Sajjanar: ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు..
- ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు
- దాడికి గురైన డ్రైవర్‌కు పరామర్శ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ సిబ్బందిపై దాడులకు పాల్పడితే ఎంతటి వారికైనా చట్టపరమైన చర్యలు తప్పవని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. పోలీస్ శాఖ సహకారంతో బాధ్యులపై రౌడీ షీట్స్ తెరుస్తామని ఆయన స్పష్టం చేశారు. దుండగుల చేతిలో దాడికి గురై తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బండ్లగూడ డిపో డ్రైవర్ విద్యా సాగర్ ను వీసీ సజ్జనార్ సోమవారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును ఆయనను అడిగి తెలుసుకున్నారు.
Also Read:Mani Ratnam: మరో సినిమా స్క్రిప్ట్ మొదలెట్టిన మణిరత్నం.. ఈసారి అలాంటి కథ?
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
గాయపడ్డ డ్రైవర్ కు టీజీఎస్ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. మెహదీపట్నం నుంచి ఎల్బీ నగర్ వెళ్తున్న రూట్ నంబర్ 300 ఆర్డినరీ బస్సు కింద బైక్ పడి ఒక గర్భిణి మృతి చెందారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారు డోర్ ఒక్కసారిగా తెరవడంతో బైక్ అదుపు తప్పి బస్సు వెనుక టైర్ల కింద పడింది. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 198 వద్ద ఈ నెల 19న జరిగింది ఈ ప్రమాదం.
Also Read:Iran-Israel: ఫోర్డో అణు కేంద్రం లక్ష్యంగా ఇజ్రాయెల్ మరోసారి దాడి
ఈ రోడ్డు ప్రమాదంలో ఎలాంటి తప్పు లేకున్నా డ్రైవర్ విద్యా సాగర్ పై కొందరు విచక్షణారహితంగా దాడి చేశారు. అసభ్యపదజాలంతో దూషిస్తూ తీవ్రంగా కొట్టారు. విధులు ముగించుకుని ఇండ్లకు వెళ్తున్న ఆర్టీసీ కానిస్టేబుళ్లు భాస్కర్, ముఫకర్ అలీ లు డ్రైవర్ ను తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అప్పటికే తీవ్ర గాయాలవడంతో అక్కడి నుంచి తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి డ్రైవర్ ను తరలించారు.
Also Read:Mani Ratnam: మరో సినిమా స్క్రిప్ట్ మొదలెట్టిన మణిరత్నం.. ఈసారి అలాంటి కథ?
ఈ ప్రమాదంలో తమ డ్రైవర్‌ది ఎలాంటి తప్పులేదని, ప్రజల మధ్య విధులు నిర్వర్తించే టీజీఎస్ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేయడం బాధాకరమని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారుల పిర్యాదు మేరకు దుండగులపై సైబరాబాద్ కమిషనరేట్ అత్తాపూర్ పోలీసులు బీఎన్ఎస్‌లోని 121(1), 126(2), 115(2) 352, 351(2) ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారన్నారు. తమ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతిసే, మనోవేదనకు గురిచేసే ఇలాంటి దాడులను యాజమాన్యం ఏమాత్రం సహించబోదని, నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!