AUS vs IND: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు ‘ఫాలో ఆన్’ ప్రమాదం నుంచి బయటపడింది. జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ చివరి వికెట్‌కు 39 పరుగుల కీలక భాగస్వామ్యం అందించడంతో టీమిండియా ‘ఫాలో ఆన్’ గండం నుండి బయట పడింది. వీరి మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ జట్టు ‘ఫాలో ఆన్’ ముప్పును తప్పించుకుంది. ఈ కారణంతో డ్రెస్సింగ్ రూమ్‌లో టీమిండియా కోచ్…
India Follow On: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా 3వ టెస్టు 4వ రోజు అంటే మంగళవారం (డిసెంబర్ 17)న వర్షం, బ్యాడ్ లైట్ కారణంగా ఆట చాలాసార్లు అంతరాయం కలిగింది. అయితే, ఇది భారత జట్టు దృష్టిలో మంచి విషయం అని చెప్పాలి. దీనికి కారణం ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ సెంచరీలతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక నాల్గవ రోజు ఆట ముగిసే…
IND vs AUS: గబ్బా టెస్ట్ మ్యాచ్‌లో నాలుగో రోజు ఆటను వర్షం కారణంగా ముందుగానే ముగించాల్సి వచ్చింది. KL రాహుల్, రవీంద్ర జడేజాల హాఫ్ సెంచరీల సహాయంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో క్రికెట్ టెస్టులో నాల్గవ రోజున భారత్ ఫాలో-ఆన్‌ను కాపాడుకుంది. నాల్గవ రోజు ముగియడంతో మ్యాచ్ డ్రాగా మారుతున్నట్లు కనిపిస్తోంది. జడేజా 123 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 77 పరుగులు చేశాడు. మరోవైపు కెఎల్ రాహుల్ 139 బంతుల్లో 84 పరుగులు…
పాకిస్థాన్ వర్సెస్ ఇంగ్లండ్ మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ జరుగుతుంది. ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్ 152 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఎట్టకేలకు సొంతగడ్డపై టెస్టు విజయాన్ని రుచి చూసింది. 1349 రోజుల తర్వాత సొంతగడ్డపై పాకిస్థాన్‌కు ఇదే తొలి టెస్టు విజయం. పాకిస్థాన్ తరఫున ఈ టెస్టు మ్యాచ్‌లో ఇద్దరు స్పి్న్నర్లు రెచ్చిపోయారు. నౌమన్ అలీ 11, సాజిద్ ఖాన్ 9 వికెట్లతో మొత్తం 20…
టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా రికార్డుల మోత మోగించింది. టెస్టుల్లో అత్యంత వేగంగా 50, 100, 150, 200 పరుగులు చేసిన జట్టుగా భారత్ అవతరించింది. కేవలం 3 ఓవర్లలోనే 50 రన్స్ చేసి వరల్డ్ రికార్డు నమోదు చేసిన రోహిత్, జైస్వాల్ జోడీ.. ఆ తర్వాత అత్యంత వేగంగా 100, 150, 200 రన్స్ కూడా భారత్ చేసింది.
టెస్టు క్రికెట్‌లో ఇప్పటి వరకు ఏ బ్యాట్స్‌మెన్ చేయలేని ఫీట్‌ను శ్రీలంక క్రికెటర్ కమిందు మెండిస్ సాధించాడు. మెండిస్ తన అర్ధసెంచరీని పూర్తి చేసిన వెంటనే.. తన పేరిట ప్రత్యేక ప్రపంచ రికార్డును లిఖించుకున్నాడు. అతని అరంగేట్రం టెస్ట్ మ్యాచ్ నుండి వరుసగా ఎనిమిది టెస్ట్ మ్యాచ్‌లలో 50 ప్లస్ పరుగులు చేశాడు.
బంగ్లాదేశ్ జట్టు దిగ్గజ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే.. అతని రిటైర్మెంట్ తక్షణమే అమల్లోకి రాలేదు. వెంటనే అమలులోకి వచ్చేలా టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా.. రేపటి నుంచి కాన్పూర్‌లో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ ఆడనున్నాడు. ఆ తర్వాత.. మరో టెస్ట్ సిరీస్ లో ఆడనున్నాడు.
టెస్ట్ క్రికెట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన ఆటగాళ్లలో ఒక్క భారత ఆటగాడి పేరు లేదు. వీరేంద్ర సెహ్వాగ్, రిషబ్ పంత్ వంటి భారీ హిట్టర్స్ ఉన్నప్పటికీ.. టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన జాబితాలో లేరు. భారత ఆటగాళ్ల పేరిట ఎన్నో అరుదైన రికార్డులున్నప్పటికీ, ఈ రికార్డు లేకపోవడం గమనార్హం.
బంగ్లాదేశ్‌పై టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలి టెస్టులో భారత్ 280 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతేకాకుండా.. భారత జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారిగా టెస్టు క్రికెట్‌లో ఓడిన దానికంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది.
Surya Kumar Yadav: భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దాదాపు ఏడాది తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్లో ఆడనున్నాడు. దీని తర్వాత దులీప్ ట్రోఫీలో కూడా పాల్గొంటాడు. భారత్ తరఫున కేవలం 1 టెస్టు ఆడిన సూర్యకుమార్ మళ్లీ టెస్టు జట్టులోకి రావాలనే కోరికను వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించి తాజాగా కోయంబత్తూరులో సోమవారం జరిగిన బుచ్చిబాబు టోర్నీ ప్రాక్టీస్ సెషన్ తర్వాత…