టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా రికార్డుల మోత మోగించింది. టెస్టుల్లో అత్యంత వేగంగా 50, 100, 150, 200 పరుగులు చేసిన జట్టుగా భారత్ అవతరించింది. కేవలం 3 ఓవర్లలోనే 50 రన్స్ చేసి వరల్డ్ రికార్డు నమోదు చేసిన రోహిత్, జైస్వాల్ జోడీ.. ఆ తర్వాత అత్యంత వేగంగా 100, 150, 200 రన్స్ కూడా భారత్ చేసింది. 10.1 ఓవర్లలో భారత్ 100 రన్స్ చేసింది. గతంలో ఈ రికార్డ్ కూడా భారత్ పేరిట ఉంది. తాజాగా.. తన రికార్డును తానే బ్రేక్ చేసింది. వెస్టిండీస్ పై 12.2 ఓవర్లలో 100 రన్స్ చేసి వరల్డ్ రికార్డు నమోదు చేసిన భారత్.. ఇప్పుడు బంగ్లా పై 10.1 ఓవర్ల లోనే 100 చేసి మరో రికార్డు సృష్టించింది.
Read Also: Natasa Stankovic: హార్దిక్ నుండి విడిపోయిన తర్వాత నటాషా ఏం చేస్తుందో తెలుసా..? వీడియో వైరల్
ఆ తర్వాత.. 18.2 ఓవర్లలో భారత్ 150 పరుగులు చేసింది. అనంతరం.. 24.4 ఓవరల్లో 200 రన్స్ చేసి వరల్డ్ రికార్డు సాధించింది టీమిండియా. దీంతో.. ఆస్ట్రేలియా రికార్డును భారత్ బ్రేక్ చేసింది. పాక్ పై 28.1 ఓవర్లలో 200 పరుగులు చేసిన ఆస్ట్రేలియా.. ఈ రికార్డును భారత్ బ్రేక్ చేసింది. తొలుత బంగ్లాదేశ్‌ను 233 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. టెస్టు క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ, ఫాస్టెస్ట్ 100, 150, 200 పరుగుల రికార్డును భారత్ బద్దలు కొట్టింది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ ఈ ప్రపంచ రికార్డును సృష్టించారు.
Read Also: US Embassy: అమెరికా వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్.. 2.5 లక్షల వీసా అపాయింట్‌మెంట్స్..!
రోహిత్ శర్మ 11 బంతుల్లో 23 పరుగులు చేసి ఔట్ కాగా, యశస్వి 51 బంతుల్లో 72 పరుగులు చేసి ఔటయ్యాడు. గిల్ 36 బంతుల్లో 39 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 30 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ (66), రవీంద్ర జడేజా (8) పరుగులతో ఉన్నారు.
ఇండియా ఈరోజు నమోదు చేసిన వరల్డ్ రికార్డ్స్..
కేవలం 3 ఓవర్లలో 50 రన్స్
10.1 ఓవర్లలో 100 రన్స్
18.2 ఓవర్లలో 150 రన్స్
24.4 ఓవర్లలో 200 రన్స్.