Double Century and Five wickets in one Test Match: 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎన్నో గొప్ప ప్రదర్శనలు ఉన్నాయి. ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఒక ఆటగాడు డబుల్ సెంచరీ చేసి, 5 వికెట్లు తీయడం అటువంటి ఘనత ఉందని తెలుసా మీకు.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్ చరిత్రలో 1877లో ఆడిన తొలి టెస్టు నుంచి కేవలం ఇద్దరు మాత్రమే ఈ ఘనత సాధించారు. మరి ఆ…
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టు కెరీర్ శనివారం (జనవరి 6)తో ముగిసింది. ఇటీవలే టెస్ట్ లకు, వన్డేలకు రిటైర్మెంట్ ఇచ్చిన వార్నర్.. తన కెరీర్ లో నేడు చివరి టెస్ట్ ఆడాడు. ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య మూడో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో వైట్‌వాష్ చేసింది. అంతేకాకుండా.. వార్నర్ కు ఆసీస్ జట్టు గెలుపుతో మంచి గిఫ్ట్ ఇచ్చింది.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో చివరి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ ముష్ఫికర్ రహీమ్ 'హ్యాండిల్డ్ ది బాల్' కారణంగా ఔట్ అయ్యాడు. దీంతో.. టెస్టు క్రికెట్‌లో ఈ విధంగా ఔటైన తొలి బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. క్రికెట్‌లో అతి తక్కువగా కనిపించే ఘటనల్లో ఇదొకటి.
శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా కీలక నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు క్రికెట్ ఫార్మాట్ కు హసరంగా విడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని అతడు ఇవాళ (మంగళవారం) శ్రీలంక క్రికెట్‌కు తెలిపాడు.
వెస్టిండీస్‌తో వచ్చే నెలలో జరగనున్న టెస్టు సిరీస్‌కు టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చటేశ్వర్ పుజారాను ఎంపిక చేయలేదు. కొంతకాలంగా ఫామ్‌లో లేక సతమతమవుతున్న పుజారా ఇటీవలే డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 41 పరుగులు మాత్రమే చేసి విఫలమైన పుజారాపై బీసీసీఐ వేటు వేసింది.
India vs Australia 2nd Test: భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ఇవాళ ప్రారంభం కానుంది. నాలుగు టెస్టుల బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో…భారత్ తొలి టెస్టుల విజయం సాధించింది. ఢిల్లీలోనూ విజయం సాధించి.. ఆధిక్యతను కంటిన్యూ చేయాలని రోహిత్ సేన వ్యూహాలు రచిస్తోంది. మొదటి టెస్టులోని జట్టును.. రెండో టెస్టులోనూ కంటిన్యూ చేయనుంది. బ్యాటర్లు, బౌలర్లు ఫామ్‌లో ఉండటంతో.. టీమిండియా రెట్టించిన ఉత్సాహంలో బరిలోకి దిగుతోంది. ఐదేళ్ల తర్వాత ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో టెస్టు మ్యాచ్‌కు…
Ben Stokes: ఐసీసీపై ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ సంచలన ఆరోపణలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ రూపకల్పనపై ఐసీసీ తగినంత శ్రద్ధ చూపడం లేదన్నాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ వన్డే సిరీస్ ఇందుకు అతి పెద్ద ఉదాహరణ అని.. ఎలాంటి ఉపయోగం లేని సిరీస్‌ను షెడ్యూల్ చేయడం ద్వారా ఎవరికైనా అర్ధమైందా అంటూ స్టోక్స్ ఆరోపించాడు. దేశవాళీ టీ20లకు ఆదరణ పెరుగుతుండటం టెస్ట్ ఫార్మాట్ అస్థిత్వాన్ని ప్రమాదంలోకి నెడుతుందని స్టోక్స్ అభిప్రాయపడ్డాడు.…
Team India: టీమిండియా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం టీ20 క్రికెట్లో దుమ్మురేపుతున్నాడు. ఐసీసీ ర్యాంకుల్లోనూ నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. బంతి ఎటువైపు వేసినా సూర్యకుమార్ సిక్సర్లు దంచుతున్నాడు. వినూత్నమైన షాట్లతో అలరిస్తున్నాడు. అతడి స్ట్రైక్‌రేట్‌తో పాటు యావరేజ్ కూడా ఎక్కువగానే ఉంటోంది. టీ20 క్రికెట్ తరహాలో సూర్యకుమార్ వన్డేల్లోనూ తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే అతడు టెస్టుల్లో అరంగేట్రం చేస్తాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మిడిలార్డర్లో అతడికి అవకాశం ఇస్తారని అంటున్నారు. Read…
ICC Test Championship Finals: క్రికెట్లో టెస్ట్ క్రికెట్‌లో ఉండే మజానే వేరు. కానీ కొన్నేళ్లుగా టీ20లు రాజ్యమేలుతున్నాయి. దీంతో ఐసీసీ టెస్ట్ క్రికెట్ పునరుజ్జీవం కోసం టెస్టు చాంపియన్ షిప్ నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ జట్ల మధ్య టెస్టు సిరీస్‌లు జరిపి పాయింట్ల ఆధారంగా రెండేళ్లకోసారి ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గత ఏడాది తొలిసారిగా జరిగిన ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడగా న్యూజిలాండ్ విన్నర్‌గా…
Bangladesh: అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో రిటైర్మెంట్ల హవా నడుస్తోంది. తాజాగా బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ రూబెల్ హుస్సేన్(32) టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఫేస్బుక్లో తన రిటైర్మెంట్ గురించి పోస్ట్ చేశాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం కొనసాగుతానని రూబెల్ హుస్సేన్ స్పష్టం చేశాడు. 2009లో వెస్టిండీస్‌తో తొలిసారి టెస్ట్ మ్యాచ్ ఆడిన రూబెల్.. చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో పాకిస్థాన్‌తో రావల్పిండిలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆడాడు. ఈ టెస్ట్…