టెస్టు క్రికెట్‌లో ఇప్పటి వరకు ఏ బ్యాట్స్‌మెన్ చేయలేని ఫీట్‌ను శ్రీలంక క్రికెటర్ కమిందు మెండిస్ సాధించాడు. శ్రీలంక-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి టెస్టు గాలె వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 90 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్ 78 పరుగులు, కమిందు మెండిస్ 51 పరుగులు చేసి నాటౌట్‌గా వెనుదిరిగారు. మెండిస్ తన అర్ధసెంచరీని పూర్తి చేసిన వెంటనే.. తన పేరిట ప్రత్యేక ప్రపంచ రికార్డును లిఖించుకున్నాడు. అతని అరంగేట్రం టెస్ట్ మ్యాచ్ నుండి వరుసగా ఎనిమిది టెస్ట్ మ్యాచ్‌లలో 50 ప్లస్ పరుగులు చేశాడు. పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ సౌద్ షకీల్ ప్రపంచ రికార్డును కమిందు మెండిస్ బద్దలు కొట్టాడు.
Read Also: Shakib Al Hasan: బంగ్లా స్టార్ క్రికెటర్ కీలక నిర్ణయం..రిటైర్మెంట్ ప్రకటన..!
సౌద్ షకీల్ తన అరంగేట్రం టెస్టు నుంచి వరుసగా ఏడు టెస్టుల్లో 50 ప్లస్ స్కోర్ చేశాడు. ఈ సిరీస్‌లోని తొలి టెస్టు మ్యాచ్‌లో మెండిస్ షకీల్‌ను సమం చేశాడు. షకీల్ తన ఎనిమిదో టెస్ట్ మ్యాచ్‌లో యాభై పరుగులు చేయలేకపోయాడు. మెండిస్ వరుసగా 8 మ్యాచ్ లలో 50 ప్లస్ స్కోరు చేశాడు. కమిందు మెండిస్ అరంగేట్రం చేసినప్పటి నుంచి ఆడుతున్న తీరు శ్రీలంకకు కాబోయే స్టార్‌గా పేరు తెచ్చుకుంటున్నాడు.
Read Also: Killer Wolf: డ్రోన్ కెమెరాకు చిక్కిన 10 మందిని చంపిన కిల్లర్ తోడేలు..