పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరును భారత్ ఎండగట్టనుంది. ఉగ్రవాదాన్ని మన దేశంపైకి ఎగదోస్తున్న తీరును ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లనుంది. ఇప్పటికే పహల్గాం ఘాతుకాన్ని అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్‌పై భారత్ దౌత్య యుద్ధం చేయాలని నిర్ణయించింది. ప్రపంచ దేశాలకు అఖిలపక్ష ప్రతినిధి బృందాలు వెళ్లనున్నాయి.. మోడీ సర్కార్ ఏడు డెలిగేషన్స్‌ను ఏర్పాటు చేసింది. అమెరికా వెళ్లే ప్రతినిధి బృందానికి శశిథరూర్ నేతృత్వం వహించనున్నారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. మన దేశం సాధించిన ఈ విజయంతో పాకిస్థాన్ నేతలు చిరాకుపడి.. తామే గెలిచామంటూ తమ డబ్బు తామే కొట్టుకుంది. తాజాగా ఉద్రిక్తత పరిస్థితుల అనంతరం భారత్‌ను కాపీ కొట్టడంలో పాకిస్థాన్ బిజీగా మారింది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు సామేత ప్రస్తుతం పాకిస్థాన్‌కి బాగా అబ్బుతుంది.
ఉగ్రవాదులకు ప్రధాన స్థావరాలైన బహావల్‌పుర్, మురుద్కేపై భారత సైన్యం మెరుపు దాడి చేసి బీభత్సం సృష్టించింది అని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులు, ఉగ్రవాద సానుభూతిపరులకు భారత్ ఏం చేస్తుందో క్లియర్ గా చెప్పింది అన్నారు. పాకిస్తాన్ గర్వంగా చెప్పుకునే డ్రోన్లు, మిసైల్లను పూర్తిగా ధ్వంసం చేశాం.
ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదని పాకిస్తాన్ అర్థం చేసుకోవాలి, లేకుంటే ఎన్ని చర్చలు జరిపినా ఆశించిన ఫలితం రాదని స్పష్టం చేశారు భారత మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్.. ఇప్పుడు భారత్ జాగ్రత్తగా ఉండాలన్నారు.. ఆపరేషన్ సిందూర్‌లో భాగస్వాములైనమా అధికారులకు సెల్యూట్ చేయండి, వారిని చూస్తే గర్వంగా ఉంది.. సాయుధ దళాలు అద్భుతమైన నిర్ణయాలతో విజయం సాధించాయి అంటూ ఆపరేషన్ సిందూర్‌పై ప్రశంసలు కురిపించారు.
Indian Air Force: ఆపరేషన్ సింధూర్‌పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని తేల్చి చెప్పింది. ఆపరేషన్ ఇంకా ముగియలేదని తెలిపింది.
కొంతమంది బీజేపీ యాక్టివిస్టులు పాకిస్థాన్ ప్రధాని వచ్చి మోడీ కాళ్లపై పడి ప్రాధేయపడుతున్నట్టు ఏఐ ఫొటోలు సృష్టించి సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. కానీ, అసలు కాల్పుల విరమణ ఒప్పందం ఎందుకు జరిగింది? ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అనే విషయం ఇప్పటి వరకు ఎవరికీ దొరకని మిస్టరీగా ఉండిపోయింది.
పాకిస్తాన్‌తో కాల్పులు విరమణ ఒప్పందం జరిగిన తర్వాత ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న చర్యను ప్రధాని నరేంద్ర మోడీ వైఖరితో పోల్చుతూ సోషల్ మీడియా జోరుగా ప్రచారం జరుగుతోంది
China Support Pak: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ స్వాతంత్య్రం కోసం తమ మద్దతు కొనసాగుతుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వెల్లడించారు.