పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. మన దేశం సాధించిన ఈ విజయంతో పాకిస్థాన్ నేతలు చిరాకుపడి.. తామే గెలిచామంటూ తమ డబ్బు తామే కొట్టుకున్నారు. తాజాగా ఉద్రిక్తత పరిస్థితుల అనంతరం భారత్‌ను కాపీ కొట్టడంలో పాకిస్థాన్ బిజీగా మారింది. “పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుంది” సామేత ప్రస్తుతం పాకిస్థాన్‌కి బాగా అబ్బుతుంది.
1) భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పేరిట.. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ అనంతరం.. పాకిస్థాన్ ఆపరేషన్ బన్యన్ అల్ మర్సూస్‌ను ప్రారంభించింది. దీని అర్థం గాజు లాంటి బలమైన గోడ. ఈ ఆపరేషన్ కింద.. పాకిస్థాన్ భారతదేశంలోని నివాస ప్రాంతాలపై దాడి చేసింది. దీనికి భారత సైన్యం తగిన సమాధానం ఇచ్చింది. ఈ ఆపరేషన్‌తో ప్రపంచం ముందు తనను తాను బలంగా చూపించుకోవడానికి ప్రయత్నించిన పాక్ ఘోరంగా విఫలమైంది.
2) సైన్యంలో మనోధైర్యాన్ని పెంచేందుకు ఇటీవల భారత ప్రధాని మోడీ పంజాబ్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌కు చేరుకుని సైనికులను కలిసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ ప్రధాని ఈ అంశాన్ని కూడా కాపీ కొట్టారు. పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ సియాల్‌కోట్‌లోని పస్రూర్ ఆర్మీ క్యాంప్‌కు చేరుకున్నారు. పాకిస్థాన్ సైనికులను కలిశారు. మే 10న భారత సైన్యం ఈ ఆర్మీ క్యాంప్ యొక్క రాడార్ వ్యవస్థను ధ్వంసం చేసినందున షరీఫ్ ఇక్కడికి వచ్చారు. ప్రధాని మోడీ సైనికులను ఉద్దేశించి ప్రసంగించిన మాదిరిగానే.. షరీఫ్ కూడా సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు.
3) ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైన్యం నిరంతరం పత్రికా సమావేశాల నిర్వహించింది. తాజా పరిస్థితులను దేశ ప్రజలకు తెలియజేస్తూనే ఉంది. మరోవైపు, పాకిస్థాన్ ISPR DG మేజర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి కూడా ఇదే మార్గాన్ని అనుసరించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో కలిసి సమాచారం గురించి వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ కూడా తన వైమానిక దళం ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్, ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ ను విలేకరుల సమావేశాల్లో పాల్గొనేలా చేసింది. కానీ.. వచ్చి రానీ ఇంగ్లీష్ కారణంగా ఔరంగజేబ్ అహ్మద్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాడు.
4) పాకిస్థాన్ యుద్ధభూమిలోనే కాదు.. క్రికెట్ మైదానంలో కూడా భారతదేశాన్ని కాపీ కొట్టింది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పుడు భారత్ ఐపీఎల్‌ను వాయిదా వేసింది. కానీ కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత.. మే 17 నుంచి కొత్త షెడ్యూల్‌తో ఐపీఎల్ తిరిగి జరుగుతుందని ప్రకటించారు. పాక్‌లో కూడా మే 9న తన పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) వాయిదా పడింది. మే 17 నుంచి PSLను పునఃప్రారంభించాలని పాక్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. తేదీని కూడా కాపీ చేయడంతో సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి.