పహల్గాం దాడిలో ఉగ్రవాదులు ఏ మతం వారో అడిగి మరీ చంపడంతో సహనం పూర్తిగా పోయిందని, అందువల్లే పాకిస్తాన్‌కు భారత్ తిరిగి సమాధానం చెప్పాల్సి వచ్చిందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. భారతదేశం 1947 నుండి సరిహద్దు ఉగ్రవాదంతో బాధపడిందన్నారు. భారతదేశాన్ని మరింతగా బాధపెట్టకుండా పాకిస్తాన్ వెనక్కి తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ పాక్ పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని, ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంది అని పురంధేశ్వరి చెప్పారు.…
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ నాలుగు దేశాల పర్యటనలో ఉన్నారు. ఇక టర్కీ రాజధాని అంకారాలో ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ప్రత్యేకంగా స్వాగతం పలికారు.
షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రస్తుతం నాలుగు దేశాల పర్యటనలో ఉన్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో కలిసి షెహబాజ్ షరీఫ్ సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ..
ఆనంద సంబరాల వేళ ఒక్కసారిగా వాతావరణం భీతావాహంగా మారింది. ఓ వైపు సంబరాలు.. ఇంకోవైపు హాహాకారాలతో ఇంగ్లండ్‌లోని లివర్‌పూల్ మారిపోయింది. ప్రీమియర్ లీగ్‌లో 20వ టైటిల్‌ను లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్ సొంతం చేసుకుంది.
ఆపరేషన్ సింధూర్ ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిందని తెలిపారు. ఉగ్రవాదానికి ఈరోజు దేశం మొత్తం వ్యతిరేకంగా నిలిచింది అన్నారు. ఆపరేషన్ సింధూర్ టైంలో భారత సైన్యం ప్రదర్శించిన పరాక్రమం ప్రతి భారతీయుడిని గర్వించేలా చేసిందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకొన్న చర్యలను ఎంపీ శశిథరూర్ భారత కాన్సులేట్‌లో చెప్పుకొచ్చారు. పహల్గాంలో మతం ఆధారంగా టూరిస్టులపై ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారని పేర్కొన్నారు.
Siraj : ఉగ్రకదలికలపై తీవ్ర దృష్టిసారించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), హైదరాబాద్‌లో కీలకంగా మకాం వేసిన సిరాజ్ అనే వ్యక్తి చుట్టూ దర్యాప్తును ముమ్మరం చేసింది. గత ఏడు సంవత్సరాలుగా గ్రూప్స్ పరీక్షల శిక్షణ పేరుతో హైదరాబాద్‌లో తిష్ట వేసిన సిరాజ్, పక్కా వ్యూహంతో కార్యకలాపాలను సాగించినట్లు అధికారులు గుర్తించారు. సిరాజ్‌తో కలిసి ఉన్న సమీర్ అనే వ్యక్తి – హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో రెక్కీ చేసినట్లు తెలిసింది. గత సంవత్సరం నవంబరు…
ఇంత భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా తరలి వచ్చారని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్ర కార్యక్రమం జరిగింది. వర్షం కుస్తున్నప్పటికీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రసంగించారు. కరీంనగర్ లో ఏక్తా యాత్ర ప్రారంభిస్తే నన్ను హిందూ పిచ్చోడని హేళన చేశారన్నారు. ఏక్తా యాత్ర రోజే పోటీ యాత్రలు పెట్టి విచ్చిన్నం చేయాలని చూశారన్నారు. తరలివచ్చిన ఈ జనాన్ని చూస్తుంటే ఎందాకైనా పోరాడాలన్పిస్తోందన్నారు. గతంలో ఇదే హిందూ ఏక్తా యాత్ర…
ముంబై ఉగ్ర దాడి ప్రధాన సూత్రధారులలో ఒకరైన తహవూర్ హుస్సేన్ రాణాను అమెరికా భారత్ కు అప్పగించినట్లుగానే.. ఇస్లామాబాద్ లోని కీలక ఉగ్రవాదులు హఫీజ్ సయీద్, సాజిద్ మీర్, జకీర్ రెహ్మాన్ లఖ్వీలను అప్పగించాలని భారత రాయబారి జేపీ సింగ్ డిమాండ్ చేశారు.
భారతదేశాన్ని అభివృద్ధి చేయడంలో ప్రధాని మోడీ ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశాన్ని సురక్షితంగా ఉంచే పని ప్రధాని మోడీ చేశారన్నారు. గాంధీనగర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 2014 కి ముందు, ప్రతిరోజూ ఉగ్రవాద దాడులు జరిగాయని.. కానీ అప్పటి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని విమర్శించారు. కానీ ఇప్పుడు అలా కాదని శత్రు దేశానికి తగిన సమాధానం చెబుతామన్నారు. సైన్యం ఇటుకలకు రాళ్లతో ప్రతిస్పందించిందని…