అమెరికాలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. దీనికి తోడు బాంబు పేలుడు కకావికలం చేసింది. బ్రూక్లిన్లో రైలు ప్రయాణించే ఓ సబ్వేలో ఐదుగురిపై కాల్పులు జరిపారు దుండగులు. దీంతో సబ్వే అంతా రక్తసిక్తమైందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో అమెరికాలో గన్ కల్చర్ మరోసారి తెరపైకి వచ్చింది. న్యూయార్క్ లో మాస్క్ తో వచ్చి దుండగులు బీభత్సం కలిగించారు. నిత్యం రద్దీగా వుండే సబ్వే లో కాల్పులతో అంతా రక్తసిక్తమైందని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఎంతమంది మరణించారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు.ఈ కాల్పుల్లో ఆరుగురు మరణించగా, 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సబ్వేలో పొగలు కమ్ముకోగా.. పోలీసులు రంగంలోకి దిగారు. కాల్పుల కారణంగానే పొగలు వెలువడ్డాయని స్పష్టం చేశారు. కాల్పులతో నగరంలో రైలు ప్రయాణాలు ఆలస్యంగా మొదలయ్యాయని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అగ్రరాజ్యంలో ఉగ్రదాడిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. దుండగుడి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది.