AP Crime: మానవత్వం మంట కలిసి మనుషులు మృగాలుగా మారుతున్నారన్నదానికి నిదర్శనమే ఈ ఘటనగా చెప్పుకోవచ్చు.. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో ఒక్కడిని చేసి నలుగురు కలిసి బెల్టులు, కర్రలతో చావబాదిన బాదిన దృశ్యాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దారుణమైన ఈ ఘటన చుండూరు మండలంలో గత నెల 30న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృగాల్లాంటి మనుషుల దాడిలో తీవ్రంగా గాయపడిని బాధితుడు ప్రస్తుతం తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు.
Read Also: YS Jagan: ఇలాంటి ఘటనలతో ఏం సాధిస్తారు..? వైఎస్ జగన్ ఫైర్
బాధితుడు, అతని తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న పరిమి గ్రామానికి చెందిన బాధితుడు అజ్గర్‌ను ఈ నెల 30వ తేదీన కొందరు యువకులు పని ఉందంటూ చండూరు డొంకలోకి తీసుకు వెళ్లి మద్యం తాగించారు. వారు కూడా మద్యం సేవించారు.. ఆ తర్వాత ఏవేవో కారణాలు చెబుతూ యువకుడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కర్రలు, బెల్టులు తీసుకుని చితకబాదారు. బాధిత యువకుడు కొట్టొద్దని మొత్తుకున్నా, కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా విచక్షణా రహితంగా అతడిని కాళ్లు, చేతులు.. ఇలా తేడా లేకుండా.. కర్రలు, బెల్టులతో చితకబాదారు. కొడుతున్న దృశ్యాలను వాళ్లే సెల్‌ఫోన్లలో చిత్రీకరించి పైశాచికానందం పొందారు. చివరికి తీవ్రగాయాల పాలైన అస్గర్ ను కాల్వలో విసిరేద్దామని యువకులు చర్చించుకుంటున్న సమయంలో.. అస్గర్ సొంత గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.. ప్రస్తుతం యువకుల దాడిలో తీవ్ర గాయాలపాలైన బాధితుడు తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే , బైక్ చోరి కేసులో సమాచారం ఇవ్వడంతో పాటు, ఆడపిల్లకు సంబంధించి వాట్సప్ లో మెసేజ్‌ల వ్యవహారం నేపథ్యంలో యువకుడ్ని ఒంటరిగా నిర్బంధించి తీవ్రంగా దాడి చేసినట్లు ప్రచారం జరగుతుంది.. కాగా దాడికి పాల్పడిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.