Temperature: మండిపోతున్న ఎండలు.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు..
- తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు..
- ఉదయాన్నే సుర్రు మనిపిస్తున్న సూరీడు..
- పలుజిల్లాల్లో 40 డిగ్రీలు దాటేసిన ఎండలు..
- మార్చి నెలలో మధ్యలో భగభగలాడుతున్న సూరీడు..
- ఎండలకు తోడు వడగాలులు..
- శీతల పానియాలను ఆశ్రయిస్తున్న ప్రజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Temperature: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా.. దక్షిణ తెలంగాణతో పోలిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. వచ్చే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకుపైగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రతతోపాటు వడగాలుల ప్రభావం కూడా ఉంది. ఇవాళ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నందున 7 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్‌లో 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఏపీలోనూ ఎండలు ఠారెత్తిస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు మరింత పెరిగినట్లుగా వాతావరణ కేంద్రం తెలిపింది. పల్నాడు జిల్లాలోని రెంటచింతలలో 42.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రెంటచింతల ప్రాంతంలో సాధారణంగా మార్చి నెలలో 35 డిగ్రీల వరకు ఎండ ఉంటుంది. ఈసారి మాత్రం మార్చి మధ్యలోనే 42 డిగ్రీలు దాటిపోయింది. దాంతో రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని అక్కడి జనం ఆందోళన చెందుతున్నారు. కోస్తాలోని కొన్ని జిల్లాల్లో వాతావరణం అనూహ్యంగా మారుతోంది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండ తీవ్రంగా పడుతోంది.
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
మార్చిలోనే భానుడు తన ప్రతాపంతో టాప్ లేపేస్తున్నాడు.. ఈ ప్రాంతం అ ప్రాంతం అని తేడాలేకుండా మంటలు పుట్టిస్తున్నాడు..దీంతో జనాలు అ సమ్మర్ హీట్ ను బీట్ చేసేందుకు చల్ల చల్లని,కూల్ కూల్ గా వుండే ఫ్రూట్స్ , సమ్మర్ డ్రింక్స్ ను తీసుకుని ఎండ ప్రతాపాన్నికూల్ చేస్తున్నారు. మరో వైపు .. వేడి తీవ్రత అధికంగా ఉండటం వల్ల డీహైడ్రేషన్, తలనొప్పి, నీరసం, గుండెపోటు ప్రమాదాలు పెరుగుతాయి అంటున్నార వైద్య నిపుణులు.అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికల ప్రకారం.. తెలంగాణలో నేటి నుంచి ఉష్ణోగ్రతలు మరింతగా పెరగనున్నాయి.. సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు అధికంగా టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉండగా.. నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉక్కపోత వాతావరణం ఉంది.. నేడు 8 జిల్లాల్లో దాదాపు 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉండటంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ.. ఆదిలాబాద్.. జగిత్యాల.. కొమరం భీం.. మంచిర్యాల.. నిర్మల్.. నిజామాబాద్.. పెద్దపల్లి.. సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ కాగా.. ఉత్తర తెలంగాణలో వడగాల్పులు వీచే అవకాశం ఉందంటున్నారు.. హైదరాబాద్ లోను 40 డిగ్రీలకు చేరువవతున్నాయి ఉష్ణోగ్రతలు.. సిటీలో తీవ్ర ఉక్కపోత వాతావరణం.. వడగాలులు వీస్తున్నాయి.. నిన్నటి నుంచి హైదరాబాద్ లో ఉష్ణోగ్రతల తీవ్రత పెరగడంతో.. అవసరం ఉంటేనే బయటకు రావాలని హెచ్చరిస్తోంది ఐఎండీ..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!