ఢిల్లీ వాసులు ఎండ వేడిమి నుంచి కాస్త తెప్పరిల్లారు. ఉదయం నుంచి భానుడు భగభగమండిపోయాడు. ఇక బుధవారం రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. 52.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. దీంతో హస్తిన వాసులు వేడి, ఉక్కపోతతో అల్లాడిపోయారు. బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో సడన్‌గా సాయంత్రం వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా ఈదురుగాలులు, ఉరుములతో తేలికపాటి వర్షం కురిసింది. దీంతో నగరవాసులు వేడి నుంచి ఉపశమనం చెందారు. మరోవైపు చల్లటి గాలులను ప్రజలు ఆస్వాదిస్తున్నారు. ఉల్సాసం.. ఉత్సాహంగా గడుపుతున్నారు.
ఇది కూడా చదవండి: Congress: ప్రధాని మోడీ “ధ్యానం”పై కాంగ్రెస్ అభ్యంతరం.. ఈసీకి ఫిర్యాదు..
ఢిల్లీ, నోయిడా, ఎన్‌సీఆర్, ఇతర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉరుములు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. రాబోయే రెండు గంటలు అక్కడక్కడా చిరు జల్లులు, తేలికపాటి వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Samantha Ruth Prabhu: సినిమలున్నా లేకున్నా సమంతే తోపు బాసూ..
ఇక ఢిల్లీని తాగునీటి కష్టాలు కూడా వెంటాడుతున్నాయి. గత కొద్ది రోజులుగా కనీస అవసరాలకు నీళ్లు దొరకడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నీటిని వృధా చేస్తే రూ.2 వేలు జరిమానా విధించాలని నిర్ణయం తీసుకుంది.
#WATCH | Noida, Uttar Pradesh: Noida receives light rain showers giving mild respite from severe heatwave.
(Visuals from Sector 4) pic.twitter.com/G1N1uUZE4j
— ANI (@ANI) May 29, 2024
29/05/2024: 15:45 IST; Light intensity rain/drizzle and winds with speed of 20-30 Km/h would occur over and adjoining areas of isolated places of Delhi and NCR, Kharkhoda, Jhajjar, Sohana, Palwal, Nuh, Aurangabad, Hodal (Haryana) Jattari, Khair (U.P.) during next 2 hours. pic.twitter.com/AP2ho8X0rw
— RWFC New Delhi (@RWFC_ND) May 29, 2024