దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం దట్టమైన పొగమంచు కురిసింది. దీంతో.. 194 విమానాలు, 22 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 3.5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఇది ఈ సీజన్ లో కనిష్ట ఉష్ణోగ్రత. ఈ ఉదయం ఢిల్లీ విమానాశ్రయం ప్రాంతంలో విజిబిలిటీ జీరో మీటర్లుగా ఉంది. కాగా.. ఢిల్లీ విమానాశ్రయం గత రాత్రి పొగమంచు హెచ్చరికను జారీ చేసింది. ప్రయాణీకులు విమానాల గురించి తాజా…
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ సమయంలో చలి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మంచు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో బయటకు వెళ్లాలంటే చాలా కష్టం. అయితే.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఎల్విరా లండ్‌గ్రెన్ చలితో వణుకుతున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎల్విరా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. కాగా.. ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో మీరు ఎల్విరా చుట్టూ మంచు పర్వతం ఉన్నట్లు చూడవచ్చు. ఎల్విరా తన తడి…
తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి పెరిగిపోతోంది. ఉష్ణోగ్రతలు తగ్గడానికి తోడు శీతల గాలులు బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో ఇంటిలో ఉన్నప్పటికీ జనంలో వణుకు తగ్గడం లేదు. దీంతో చలిమంటలను జనం ఆశ్రయిస్తున్నారు. స్వెట్టర్లు, రగ్గులు కప్పుకున్నా.. చలి మాత్రం వాయించేస్తోంది. దీంతో ఇదెక్కడి చలిరా బాబు అంటూ జనం గజగజా వణుకుతున్నారు.
అంతరిక్ష పరిశోధన చరిత్రలో మొట్టమొదటిసారిగా చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై నేల ఉష్ణోగ్రతను వివరించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన విక్రమ్ ల్యాండర్‌లోని ChaSTE(చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్) పేలోడ్ సహాయంతో చంద్రయాన్-3 చేసిన పరిశోధనలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
రాష్ట్రంలో మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. . అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేసింది.
Telangana Rain: మండుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోని మరికొన్ని ప్రాంతాల మీదుగా విస్తరించేందుకు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
దేశంలో కురుస్తున్న వర్షాల కారణంగా గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదవుతోంది. ఇదిలా ఉండగా, మే నెలలో దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వేడి వాతావరణం కనిపిస్తుంది.
మిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నీలగిరి, కోయంబత్తూర్, తిరుపూర్, ఈరోడ్ సహా 15 జిల్లాల్లో రేపు (ఏప్రిల్ 23) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు (ఏప్రిల్ 22) తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌లోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వేసవిలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి. ఎండల ధాటికి ప్రజలు బెంబేలెత్తిపోయారు. మార్చి నెలలో దేశంలో ఉష్ణోగ్రత స్థాయిలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఓవైపు వేడిగాలులు, మరోవైపు చలి.