Sunstroke: వడదెబ్బకు ఇద్దరు మరణించిన ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఎండ తీవ్రత అధికమయింది. దీంతో ఉష్ణోగ్రతలు కూడా అత్యధికంగా నమోదవుతున్నాయి.
ఏపీలో భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు
Temperatures in Telangana: తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతల మార్క్ ను దాటేసింది.
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి చివరి వారంలోనే భానుడు భగభగ మంటు చుక్కలు చూపిస్తున్నాడు. ఇక, ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదు అవుతున్నాయి.
Weather Department: వేసవి ప్రారంభం అయింది. మార్చి ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. మొదటి వారంలోనే వేడి విపరీతంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ ఉష్ణోగ్రతలు దాదాపు 5 డిగ్రీల వరకు పెరిగాయి.
ఫిబ్రవరి నెల నుంచే సూర్య ప్రతాపం మొదలైంది. మార్చి నెల సగమైనా గడవక ముందే వాతావరణం మండువేసవిని తలపిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని సామాన్యుడు బెంబేలెత్తుతున్నాడు! గత ఏడాదితో పోల్చితే ఫిబ్రవరి నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం మొదలైంది. మార్చి నెలలో సాధారణం కంటే రోజువారీ ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీలు ఎక్కువగానే నమోదవుతున్నాయి.
Temperatures Increase in Telugu States: వేసవి ప్రారంభం అయింది. మార్చి ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. మొదటి వారంలోనే వేడి విపరీతంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల వరకు పెరిగాయి. తెలంగాణలోని పలు జిల్లాలలో శుక్రవారం (మార్చి 8) పగటి ఉష్ణోగ్రతలు దాదాపుగా 40 డిగ్రీల వరకు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో 35 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అంటే ఈసారి వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు ఏపీలోని…
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. మే నెల చివరిదాకా ఎండలు దంచికొట్టే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ వెల్లడించింది. ఈ మూడు నెలలు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువే నమోదు కానున్నాయని తెలిపింది.
Temperatures Rise in Telangana State: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు అప్పుడే ముదిరిపోయాయి. ఇంకా మార్చి నెల కూడా రాకముందే ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తెలంగాణలో దాదాపు 4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32 నుంచి 37 డిగ్రీల మధ్యన పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.…
Temperatures increasing in Telangana: మొన్నటివరకు వణికించిన చలి.. ఇటీవలి రోజుల్లో తగ్గుముఖం పట్టింది. తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా దాదాపుగా అన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్నాయి. 5 రోజుల నుంచి ఖమ్మంలో సాధారణం కన్నా.. 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత ఉంటోంది. మరోవైపు హైదరాబాద్‌లో 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మహబూబ్‌నగర్, మెదక్, భద్రాచలం, హనుమకొండ, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లోనూ ఎండ…