ఎండాకాలం రానే వచ్చింది. ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. ఎండలకు తోడు వేడిగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. బుధవారం (12-03-25) కృష్ణా జిల్లా ఉంగుటూరు, ఉయ్యూరు మండలాలు, పార్వతీపురంమన్యం జిల్లా పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట, మక్కువ, కొమరాడ, గరుగుబిల్లి, జియమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పాలకొండ, సీతంపేట, వీరఘట్టం మండలాలు, శ్రీకాకుళం జిల్లా బూర్జ, లక్ష్మీనరసుపేట, హీరామండలం, విజయనగరం జిల్లా బొబ్బివి, వంగర మండలాల్లో తీవ్ర వడగాల్పులు (19) ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
Also Read:Robinhood: నితిన్ కెరీర్లోనే హయ్యెస్ట్ నాన్ థియేట్రికల్ బిజినెస్
రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు:
శ్రీకాకుళం జిల్లా-18, విజయనగరం-21,పార్వతీపురం మన్యం-3, అల్లూరి సీతారామరాజు-12, అనకాపల్లి-13, కాకినాడ-18, కోనసీమ-11, తూర్పుగోదావరి-19,పశ్చిమగోదావరి-4, ఏలూరు-16, కృష్ణా-10, గుంటూరు-14, బాపట్ల-3, పల్నాడు జిల్లాలోని 12 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. గురువారం 53 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 197 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
Also Read:Robinhood: నితిన్ కెరీర్లోనే హయ్యెస్ట్ నాన్ థియేట్రికల్ బిజినెస్
మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో 39°C, పార్వతీపురంమన్యం జిల్లా కురుపాంలో 39°C, ఏలూరు జిల్లా రాజుపోతేపల్లిలో 38.7°C, నంద్యాల జిల్లా జూపాడు బంగ్లాలో 38.7°C, విజయనగరం జిల్లా నెలివాడలో 38.3°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. మంగళవారం 37 మండలాల్లో వడగాల్పులు వీచాయని అన్నారు.
Also Read:Sai Pallavi : చీరకట్టులో సాయిపల్లవి డ్యాన్స్.. ఎంత ముచ్చటగా ఉందో
ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు. వడగాల్పులు వీచే మండలాల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.