సోమాలియా తీరంలో హైజాక్ చేయబడిన ఎంవీ లీలా నార్ఫోక్ అనే నౌకలోని 15 మంది భారతీయులతో సహా సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారు. వారందరిని భారత నేవీ కమాండోలు కాపాడారు. హైజాక్‌కు గురైన సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన భారత నేవీ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి అందులోని సిబ్బందిని రక్షించారు.
పాకిస్థాన్‌లో ఎన్నికలు వాయిదా.. తీర్మానాన్ని ఆమోదించిన సెనేట్ పొరుగు దేశం పాకిస్థాన్‌లో ఎన్నికలపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. చలి వాతావరణం, భద్రతాపరమైన కారణాలతో సార్వత్రిక ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ పాకిస్థాన్ పార్లమెంట్ తీర్మానాన్ని ఆమోదించింది. గతంలో ఆ దేశంలో సార్వత్రిక ఎన్నికల తేదీని 8 ఫిబ్రవరి 2024గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. నేటి సెషన్లో ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయాలని, ఎన్నికలను ఆలస్యం చేయాలనే తీర్మానాన్ని సెనేట్ ఆమోదించింది. ఈ తీర్మానం రెండుసార్లు సమర్పించబడింది.…
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం అందరికి తెలిసిన విషయమే. షర్మిల కాంగ్రెస్‌లో చేరడంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం పెద్ద తప్పిదమన్నారు.
అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారని, కేటీఆర్.. హరీష్ బస్సులో తిరిగరు.. వాళ్లంతా బెంజ్ కార్ల లో తిరుగుతారు కాబట్టి వాళ్లకు ఆర్టీసీ బస్సు తెలియదన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో రెచ్చిపోతున్నారు కేటీఆర్.. హరీష్ అని, నేను సభలో ఉంటే హరీష్..కేటీఆర్ ని ఆడుకునే వాణ్ణి అన్నారు. టైం బాగోలేక ఓడిపోయినని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్.. హరీష్ కి సవాల్..…
సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 4,484 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 626 సర్వీస్ లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ఈ నెల 7 వ తేది నుంచి 15 వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. సంక్రాంతికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు, మహాలక్ష్మి పథకం అమలు,…
సంక్రాంతి పండుగకు సొంత ప్రాంతాలకు వెళ్లేవారికి ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఈ సంక్రాంతికి ఆర్టీసీ అధికారులు అదనపు ఛార్జీల్లేకుండా ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఆర్టీసీ వసూలు చేయనుంది.
విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి సొంతపార్టీ, అధినేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో నా నిర్ణయం ప్రకటిస్తానని ఆయన తెలిపారు. శుక్రవారం విజయవాడలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీలో కొనసాగాలా ? వద్దా ? అనే విషయంపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.
జనవరి 22 అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం ఉండబోతోందన్నారు బీజేపీ మధ్యప్రదేశ్ రాస్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మురళీధర్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచమంతా శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తోందని, కాంగ్రెస్ ఇండియా కూటమి కుట్ర పూరితమైన చర్యలకు పాల్పడుతోందన్నారు. హిందు వ్యతిరేక శక్తులతో కలిసి అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీ రాముడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కూటమి పనిచేస్తోందని, హిందు వ్యతిరేక కార్యక్రమాలకు మద్దతు తెలుపుతున్నారని ఆయన వెల్లడించారు.…
వైసీపీని వీడుతున్నట్లు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రకటించారు. సీఎంఓలో పార్టీ కీలక నేతలను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు టికెట్ లేదని చెప్పారని ఈ సందర్భంగా వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ టీనేజీ బాలిక గత మూడు నెలలుగా అన్నంలో నిద్రమాత్రలు కలిపి తల్లిదండ్రులను మోసం చేస్తోంది. తల్లిదండ్రులు మత్తుతో నిద్రపోగానే.. ఆ అమ్మాయి తన ప్రియుడిని ఇంటికి పిలుస్తోంది.