విశాఖ జిల్లా ఉత్తర నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగుతుంది. అందులో భాగంగానే అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వంలో సామాజిక విప్లవం వచ్చిందని తెలిపారు. సామాజిక సాధికారత సాధించామన్నారు. కాగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీలను అవమానించిన నాయకుడు చంద్రబాబు అని మంత్రి మేరుగ మండిపడ్డారు. పేదవాడు ఉన్నత శిఖరాలకు వెళ్ళడమే సామాజిక న్యాయమని మంత్రి పేర్కొన్నారు.
తనకు వ్యాధి వచ్చింది, జబ్బు వచ్చిందని అసత్య ప్రచారం చేస్తున్నారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశారు. 'నాయకులకు, కార్యకర్తలకు నా ముఖ్యమైన విజ్ఞప్తి. ఇది అసత్యం... ఇలాంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని సూచించారు. నిరంతరం ప్రభుత్వ కార్యక్రమాల్లో తిరగడంతో కాస్తా డీ హైడ్రేషన్ కి గురి అయ్యానని తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం మెడికవర్ ఆసుపత్రిలో అబ్జర్వేషన్ లో ఉన్నానని.. సోమవారం నుండి యథావిధిగా ప్రభుత్వ,…
మాతృభాష కోసం నా ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.. న్యూజిలాండ్ 170 ఏళ్ల పార్లమెంట్ చరిత్రలో అతి పిన్న వయస్కురాలు అయిన సాల్ ఎంపీ హనా-రౌహితి-మాపి-క్లార్క్ ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూజిలాండ్‌లోని తెగలలో మావోరీ భాష దాదాపు అంతరించిపోయింది. న్యూజిలాండ్ హెరాల్డ్ ప్రకారం.. మావోరీ ప్రజల భాషతో పాటు హక్కులను రక్షించడానికి ఈ యువ ఎంపీ పోరాడుతుంది. అయితే, కొన్ని రోజుల క్రితం ఎంపీ హనా రౌహితి పార్లమెంటులో ప్రసంగం చేస్తూ.. మావోరీ…
కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. షర్మిల కాంగ్రెస్ లో చేరిక వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. ప్రజలా? కుటుంబమా అన్న ప్రశ్న వస్తే మా ముఖ్యమంత్రి ఛాయిస్ ప్రజలేనని తెలిపారు. రాజకీయాల్లో కుటుంబానికి ప్రాధాన్యత ఉండకూడదు అంటూనే మళ్ళీ ఈ వాదన ఎందుకు తెస్తున్నారు? అని సజ్జల ప్రశ్నించారు. వివేకానందా రెడ్డి తమకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు.. ఫలితం ఏమయ్యిందని అన్నారు. కాగా.. జగన్…
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు త్వరలో ప్రజల మధ్యకు వస్తారని మాజీ మంత్రి హరీష్ రావు శనివారం అన్నారు. తెలంగాణ భవన్లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ శస్త్రచికిత్స తర్వాత చంద్రశేఖర్‌రావు కోలుకుంటున్నారని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మనముందుకు వస్తారన్నారు. ఫిబ్రవరి నుంచి తెలంగాణ భవన్లో చంద్రశేఖర్‌రావు ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. రోజు వారీగా పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో మమేకమవుతారు. జిల్లాల్లోనూ పర్యటిస్తానని హరీష్ రావు…
అద్భుత అవకాశాల వేదిక అయిన విశాఖ నగరం 2030 నాటికి $100 బిలియన్ల ఆర్థికవృద్ధి సాధించేందుకు దోహదపడుతుందని పల్సస్ సీఈవో డా.గేదెల శ్రీనుబాబు వివరించారు. విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరంలోని ఇంజినీరింగ్ , MBA విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు, వైజాగ్‌ను $100 బిలియన్ల ఆర్థిక నగరంగా తీర్చి దిద్దెందుకు ఉన్న అవకాశాలను, ప్రణాళికలను వివరించారు. నగర ఆర్థిక గమ్యాన్ని రూపొందించడంలో విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని శ్రీనుబాబు పిలుపునిచ్చారు. తరగతి గదులలో,…
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రేపు ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు ఆ రెండు జిల్లాల్లో 'రా కదలిరా' సభలకు హాజరుకానున్నారు. తిరువూరులో అయ్యప్పస్వామి ఆలయం వద్ద, ఆచంటలో ఆచంట-మార్టేరు రోడ్ వద్ద ఈ సభలు జరగనున్నాయి.
ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. అంతేకాకుండా.. క్యాడర్ ను అప్రమత్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరీ ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.. ఆమే మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చేసి వాడుకుంటున్నారని, కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలు ప్రచారం చేసుకుంటున్నారని పురందేశ్వరీ అన్నారు.
జనవరి 22న అయోధ్యలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి పలువురు ప్రముఖులకు ఆహ్వానం పంపించింది ఆలయ కమిటి. అయితే ఈ కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదని తెలిపారు శివసేన (యుబిటి) అధినేత ఉద్ధవ్ ఠాక్రే. అయితే ఆరోజుకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే ఏమి చేయబోతున్నారో తన ప్రణాళికను చెప్పారు. ఆ రోజు నాసిక్‌లోని కాలారం ఆలయాన్ని తాను, తన పార్టీ నేతలు సందర్శించి గోదావరి నది ఒడ్డున మహా హారతి చేస్తారని…