చాలా కాలం తర్వాత ఈమధ్య అండర్ వరల్డ్ డాన్ 'దావూద్ ఇబ్రహీం' పేరు సోషల్ మీడియా లో తెగ వినిపిసుంది. ఆయనపై పాకిస్తాన్ లో విషప్రయోగం జరిగినట్టు, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా ఇండియా లో ఉన్న దావూద్ ఇబ్రహీం పూర్వీకుల ఆస్తుల గురించి పెద్ద చర్చ నడుస్తుంది.
సింగరేణి కాలరీస్ ఈ ఏడాది నిర్దేశించుకున్న 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్య సాధనలో ప్రతీ రోజూ విలువైనదేనని.. ఇందుకోసం ప్రతీ ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్. బలరామ్ స్పష్టం చేశారు. దేశ ఇంధన అవసరాలు, రానున్న వేసవి కాలంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండేందుకు వీలుగా రోజుకు 2.24 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని, రోజుకు 15 లక్షల…
ఆప్ రాజ్యసభ ఎంపీగా ఢిల్లీ ఉమెన్ ప్యానెల్ చీఫ్ నామినేట్.. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జనవరి 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్‌ను తన అభ్యర్థిగా నామినేట్ చేసింది. ఈమెతో పాటు రెండోసారి సంజయ్ సిగ్, ఎన్డీ గుప్తాలను నామినేట్ చేసింది. ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ)ఈ రోజు నామినేషన్లను ప్రకటించింది. ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ) చీఫ్‌గా ఉన్న స్వాతిమలివాల్ మొదటిసారిగా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ముఖ్యమంత్రి అరవింద్…
మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అక్కడి అన్ని రాజకీయ పార్టీలు గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో మూడో లిస్ట్ కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో సీఎంవో కార్యాలయానికి నేతలు క్యూకడుతున్నారు. సీఎంవోకు వచ్చిన నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా వచ్చారు.
కొత్తగూడెంలో అక్రమంగా తరలిస్తున్న భారీ గంజాయిని గురువారం పోలీసులు పట్టుకున్నారు. రూ. 1.62 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా.. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ ఎస్కే అబ్దుల్ రెహమాన్ మీడియాతో మాట్లాడుతూ పట్టణ శివార్లలోని రేగళ్ల క్రాస్‌రోడ్‌లో సాధారణ వాహనాల తనిఖీల్లో ఈ విషయం బయటపడిందని వెల్లడించారు. ట్రక్కులో ప్రత్యేకంగా నిర్మించిన చాంబర్లో 650 కిలోల గంజాయిని గుర్తించామని తెలిపారు. అరెస్టయిన వ్యక్తులు ట్రక్కు డ్రైవర్ సుందర్ రామ్, లారీ క్లీనర్…
పొంగల్ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పొంగల్ సందర్భంగా ప్రజలకు రూ.1000 నగదును కానుకగా అందజేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 15న పొంగల్ పండుగ జరుపుకోనున్న సంగతి తెలిసిందే.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉండవచ్చు కానీ ఆయన ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు. ఆయనకున్న క్రేజ్ అలాంటిది. ఇప్పుడు ధోనీని స్నేహితుడే మోసం చేసినట్లు తెలిసింది. ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్‌కు చెందిన మిహిర్ దివాకర్, సౌమ్య విశ్వాస్‌లపై క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ రాంచీ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జెఎన్టియు) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్, సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ డాక్టర్ శ్రీధర పణికర్ సోమనాథ్‌కు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (హానోరిస్ కాసా) డిగ్రీని ప్రదానం చేసింది. శుక్రవారం జరిగిన వర్సిటీ 12వ స్నాతకోత్సవం సందర్భంగా జేఎన్టీయూ-హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి నుంచి డాక్టర్ సోమనాథ్ గౌరవ జేఎన్టీయూ హైదరాబాద్ డాక్టరేట్‌ను…
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అక్కడి అన్ని రాజకీయ పార్టీలు గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని వైసీపీ పార్టీ సర్వేలల్లో గెలవ లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కట్ చేస్తోంది.