దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కింది. పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు. తొలి ట్రైన్ హౌరా నుంచి గౌహతికి ప్రారంభమైంది. త్వరలో పశ్చిమ బెంగాల్, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తూ వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఇక వందే భారత్ స్లీపర్ రైల్లో విద్యార్థులతో మోడీ ముచ్చటించారు.
ఇది కూడా చదవండి: Tamil Nadu Elections: పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం.. మ్యానిఫెస్టో విడుదల చేసిన ఏఐఏడీఎంకే
త్వరలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, కేరళ, బెంగాల్, అస్సాంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త రైలు ప్రారంభోత్సవానికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవాలని డిజైన్ చేసినప్పటికీ ప్రస్తుతం గరిష్టంగా గంటలకు 120-130 కిలోమీటర్ల వేగంతో నడవనుంది. ఇక దాదాపు విమాన ఛార్జీలు మాదిరిగానే వసూలు చేయనున్నారు. సౌకర్యాలు కూడా అదే మాదిరిగా ఉండనున్నాయి. బెర్తులు ఎర్గోనామిక్ డిజైన్‌లను కలిగి ఉంటాయి. అసాధారణమైన మృదువైన ప్రయాణాన్ని అందించనుంది.
స్థానిక వంటకాలు అందుబాటులో..
వేగం, పరిశుభ్రత, భద్రతతో పాటు ఈ రైలు ప్రీమియం ఎయిర్‌లైన్ సేవల మాదిరిగానే స్థానిక ఆహారాన్ని ప్రయాణీకులకు అందిస్తుంది. క్యాటరింగ్ టికెట్ ధరలో ఉంటుంది. స్థానిక రుచులు, వంటకాలపై దృష్టి పెడుతుంది. కామాఖ్య నుంచి హౌరాకు ప్రయాణించే ప్రయాణీకులకు అస్సామీ వంటకాలు వడ్డిస్తారు. హౌరా నుంచి కామాఖ్యకు తిరుగు ప్రయాణంలో ఉన్నవారు బెంగాలీ వంటకాలను ఆస్వాదించనున్నారు.
#WATCH | Malda, West Bengal: PM Narendra Modi flags off India’s first Vande Bharat Sleeper Train between Howrah and Guwahati (Kamakhya)
(Source: DD) pic.twitter.com/lQkE5g6gCa
— ANI (@ANI) January 17, 2026