హైదరాబాద్ రాయదుర్గంలో కిడ్నాపైన సాఫ్ట్వేర్ ఇంజినీర్ సురేందర్ క్షేమంగా ఉన్నాడు. కర్నూలు జిల్లా ఆత్మకూరు దగ్గర అతడిని పోలీసులు కాపాడారు. కిడ్నాప్ చేసి బంధించి కారులో తరలిస్తుండగా ఆత్మకూరు (మం) భైర్లుటీ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అంతకుముందు.. కిడ్నాపర్లు వ్యక్తి బంధువుల నుంచి రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా.. ఎట్టకేలకు కిడ్నాపర్ల చెర నుంచి సురేంద్రను రక్షించారు పోలీసులు. రాయదుర్గం నుంచి కిడ్నాపర్లు కారులో నల్లమల అడవులకు…
కామారెడ్డి నిర్వహిస్తోన్న ప్రజా పాలన కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహిస్తోన్న ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చిన ప్రజలను ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని సమస్యలకు పరిష్కారం జరుగుతుందని ఆయన వెల్లడించారు. అందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీ చెప్పిన విధంగా రాష్ట్రంలో దొరల పాలనను ఓడించి కాంగ్రెస్ పాలన తీసుకువచ్చామని, సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల అమలుకు ప్రజల వద్ద…
ఒక జాతి సాంస్కృతిక గొంతుక భాషేనని, అందుకే అమ్మ భాష తెలుగు వ్యాప్తికి అందరూ బాధ్యత తీసుకోవాలని, మిజోరాం గవర్నర్ డా. కంభంపాటి హరిబాబు సూచించారు. తెలుగు భాష పట్ల అభిమానం పెంచుకుని వ్యాప్తి చేయడం, ప్రోత్సహించడం చేయాలన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రాజమండ్రి గైట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న త్రిదిన అంతర్జాతీయ తెలుగు మహా సభలలో భాగంగా రెండవరోజు రాజరాజ నరేంద్ర వేదికపై నిర్వహించిన కృతజ్ఞతాంజలి సభలో ఈయన ముఖ్య…
నిజామాబాద్- జిల్లా కేంద్రంలో పలు కాలనీల్లో ప్రజా పాలన దరఖాస్తుల పనితీరును మాజీ మంత్రి షబ్బీర్ అలీ పరిశీలించారు. దరఖాస్తు కేంద్రాల్లో అధికారులు చేపట్టిన చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ప్రజాపాలన దరఖాస్తులకు అనూహ్య స్పందన వస్తోందని, ప్రజా స్పందన చూసి ఓర్వలేక.. బీఆర్ఎస్ నేతలు 420 బుక్ లెట్ పేరుతో కాంగ్రెస్ ను బద్నాం చేసే కుట్రలు పన్నుతున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ 10ఏళ్లలో ఎన్ని హామీలు నెరవేర్చిందో…
ఎమ్మెల్యేలు, ఎంపీలకు ట్రాన్స్ ఫర్లు ఉంటాయని తానెప్పుడూ ఊహించలేదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఒక ఊరిలో పనికి రాని చెత్త మరో ఊరిలో వేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కనిగిరి బహిరంగ సభలో టీడీపీ అధినేత ప్రసంగించారు. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కాదు...మినీ సూధన్ అంటూ విమర్శించారు.
కరీంనగర్ జిల్లా సైదాపూర్‌లో కార్యకర్తల సమావేశానికి బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 6 గ్యారంటీలను పక్క గా అమలు చేస్తాం.. వాటి అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చి నెల కాలేదు 420 ముద్ర వేసి ప్రచారం చేయడం సరి కాదని ఆయన వ్యాఖ్యానించారు. సెక్షన్ 379 ,384 ,393 395 సెక్టన్లు బిఆరెస్ నాయకులకు అప్లికేబుల్ అవుతాయని, స్లిప్పర్ చెప్పులతో…
420 ఎవరు..? రాష్ట్రానికి దళితుడ్ని సీఎం చేస్తా అని.. చీటింగ్ చేసింది ఎవరు అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రశ్నించారు. మూడెకరాల ఇస్తా అని మోసం చేశావని ఆయన ప్రశ్నించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి..ఇస్తా అని చీటింగ్ చేశావని, ఆరోగ్య శ్రీ ఎత్తేశావు చీటింగ్ చేశారన్నారు. లక్ష రుణమాఫీ ఒకే సారి అన్నావు.. ఇది చీటింగ్ అని, డబుల్ బెడ్ రూమ్ ఇస్తా అన్నావు ..ఇదో చీటింగ్ అని ఆయన అన్నారు. పేపర్…
రాజస్థాన్‌లో కాంగ్రెస్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 15 రోజుల తర్వాత ఈ మధ్యాహ్నం మంత్రులకు శాఖలను అప్పగించారు. అత్యధికులు తొలిసారిగా మంత్రులుగా పనిచేసినవారే. మంత్రులకు బాధ్యతలు అప్పగించే ముందు బీజేపీ అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించడంతో పోర్ట్‌ఫోలియో ప్రకటనకు కొంత సమయం పట్టింది.
వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర 40వ రోజుకు చేరుకుంది. ఈ బస్సుయాత్ర డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో సాగింది. యాత్ర అనంతరం మల్కిపురం ప్రధాన సెంటర్లో బహిరంగ సభ నిర్వహించారు.
కరీంనగర్ జిల్లా మానకొండుర్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీళ్ళు నిధులు నియామకాలు అనే గొప్ప ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి కేసీఅర్ అని ఆయన కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం గత కేసీఅర్ ప్రభుత్వం అని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులకు రైతుబందు వేస్తానంటే ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ కుమార్…