జనవరి 22 అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం ఉండబోతోందన్నారు బీజేపీ మధ్యప్రదేశ్ రాస్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మురళీధర్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచమంతా శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తోందని, కాంగ్రెస్ ఇండియా కూటమి కుట్ర పూరితమైన చర్యలకు పాల్పడుతోందన్నారు. హిందు వ్యతిరేక శక్తులతో కలిసి అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీ రాముడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కూటమి పనిచేస్తోందని, హిందు వ్యతిరేక కార్యక్రమాలకు మద్దతు తెలుపుతున్నారని ఆయన వెల్లడించారు. శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్టలో మేము భాగస్వాములం అవుతున్నామని ఆయన అన్నారు. అంతేకాకుండా.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హిందు వ్యతిరేక శక్తులను వ్యతిరేకించకపోవడం దురదృష్టకరమని, అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ఇచ్చిన ప్రకటనలకు, అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తున్న ప్రకటనలకు పొంతన లేదన్నారు. అధికారంలోకి రాకముందు కాళేశ్వరం నిర్మాణం, విద్యుత్ కొనుగోలు, ధాన్యం కొనుగోలు, భూముల ఆక్రమణ అంశాలలో అవినీతి జరిగిందని, సీబీఐ విచారణ జరపాలని రేవంత్ రెడ్డి పదే పదె ఆన్నారని, అడ్వకేట్ వామన రావు హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చేయాలని రేవంత్ రెడ్డి కోరారని ఆయన వెల్లడించారు. అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి నోరు మెదపడం లేదని, సీబీఐ దర్యాప్తు కొస్తే కాంగ్రెస్ కు బ్లాక్ మైల్ రాజకీయాలు చేసేందుకు తావుండదు కాబట్టే కాంగ్రెస్ లైన్ మార్చుకున్నారన్నారు.
‘అహాకారంతో కూడిన పార్టీని పక్కన బెట్టి కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించారు అంటే ప్రజలు ఏదో ఆశతో ఎదురుచూస్తున్నారని అర్థం.. జ్యూడిషియల్ విచారణకు బీజేపీ వ్యతిరేకం కాదు.. కానీ అందులో పూర్తి స్థాయి విచారణ చేసే అధికారం కేవలం సీబీఐ కి మాత్రమే ఉంది.. కాలక్షేపం కోసమే కాంగ్రెస్ జ్యూడిషియల్ విచారణ అంటుంది.. కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐకి ఇవ్వకపోవడం తెలంగాణలో ప్రజలను దగా చేయడమే.. కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై విచారణకు కాంగ్రెస్ ఎందుకు భయపడుతోంది. తక్షణమే కాళేశ్వరం అంశం సీబీఐకి అప్పజెప్పాలి. కాళేశ్వరం అవేనీతి పూర్తి స్థాయిలో సీబీఐతో విచారణ జరిపించేంత వరకు నీడల బీజేపీ వెంటపడుతుంది జాగ్రత్త.. ఫార్మా రద్దు చేయకపోవడం వెనక కాంగ్రెస్ ప్లాన్ ఏoటీ..? ఫార్మా రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రద్దు చేయకపోవడం వెనక మతలబు ఏముంది..? జాతీయ స్థాయిలో అదానిని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో ఆధాని పెట్టుబడులకు ఎట్లా స్వాగతిస్తారు…? సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అధానితో వ్యాపారాలు చేస్తున్నారు.. బయటకు మాత్రం మోడీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రచారం చేస్తున్నారు.. అదానీ ప్రజా సంపదను దోచుకున్న వ్యక్తి అయితే, దేశ సంపదను దోచుకుంటున్న వ్యక్తి అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆధానితో వ్యాపార ఒప్పందాలు ఎందుకు చేసుకుంటుంది..? ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా .. తెలంగాణ అంటే కెసిఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ ఇంట్లాంటి అహంకారాన్ని బీజేపీ సహించదు. బీఅర్ఎస్ లేక ముందే తెలంగాణకు చరిత్ర ఉంది.. చరిత్రను వ్యతిరేకిస్తే సహించేది లేదు.. బీఆర్ఎస్ అవినీతినీ బట్టబయలు చేసేంతవరకు బీజేపీ ఊరుకోదు..ఒక్క ఓటమితో బీఅర్ఎస్ చతికిల పడింది.. అలాంటిఓటములను బీజేపీ అనేకం చూసింది నిలబండింది.. నిజాం వారసత్వ బాటలోనే కాంగ్రెస్, బీఅర్ఎస్ లు నడుస్తున్నాయి…’ అని ఆయన వ్యాఖ్యానించారు.