అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారని, కేటీఆర్.. హరీష్ బస్సులో తిరిగరు.. వాళ్లంతా బెంజ్ కార్ల లో తిరుగుతారు కాబట్టి వాళ్లకు ఆర్టీసీ బస్సు తెలియదన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో రెచ్చిపోతున్నారు కేటీఆర్.. హరీష్ అని, నేను సభలో ఉంటే హరీష్..కేటీఆర్ ని ఆడుకునే వాణ్ణి అన్నారు. టైం బాగోలేక ఓడిపోయినని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్.. హరీష్ కి సవాల్.. ఇప్పటి వరకు 6 కోట్ల మంది మహిళలు బస్సులో తిరిగారు.. మీకు అమరవీరుల స్థూపం మాత్రమే తెలుసు.. వచ్చి నివాళి అర్పించి పోతరు.. మా వాళ్లకు మీరు అధికారంలో ఉన్నప్పుడు సభలో మైక్ ఇచ్చారా..? ఆరోగ్య శ్రీ 10 లక్షలకు పెంచింది మేము. కేసీఆర్ కుటుంబానికి అక్కర లేకపోవచ్చు కానీ.. పేదలకు ఇది ఎంతో అవసరం.. హరీష్.. కేటీఆర్..మీ తొమ్మిదేళ్లు పాలన ని.. కేసీఆర్ పాలన అన్నారు.. కాంగ్రెస్ అధికారంలో రాగానే ప్రజా పాలన అన్నారు కానీ.. రేవంత్ పాలన అనలేదు. ప్రజా పాలన అనే సంస్కారం మీకు లేనే లేదు. మీకు.. మా కాంగ్రెస్ కి తేడా అదే. 9 ఏండ్లలో సీఎం సెక్రటేరియట్ కి పోలేదు.
మా అధికారం లోకి వచ్చాకా సెక్రటేరియట్ లో ఫైళ్లు కు దుమ్ము దులుపుతున్నారు. ప్రాజెక్టు లు కుంగిపోయిన చరిత్ర ఎక్కడైనా ఉందా..? కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు ఎక్కడైనా కుంగినయా..? రుణమాఫీ మీద మాట్లాడే హక్కు కేటీఆర్..హరీష్ కి ఉందా. మీది నోరా.. మోరా. మీవన్నీ మురికి ముచ్చట్లే.. లక్ష మాఫీ చేయడానికి నాలుగేండ్లు పట్టింది. అప్పు తీరక పోగా.. వడ్డీ పెరిగింది. మీరేమైన ఖజానా ఇచ్చి పోయారా..? ఆరు లక్షల కోట్ల అప్పు .. బొక్క పెట్టి పోయారు. మా ఆర్థిక మంత్రి మీ అప్పులు చేసి తలకాయ పట్టుకున్నాడు. అప్పు చేయడం కాదు..వడ్డీలు ఎలా కడదాం అనుకున్నావు. అప్పులు తెచ్చి పెట్టు అని జనం ఆడిగారా. . ప్రజలు అంటే బిడ్డల లాంటి వాళ్ళు. ప్రజలకు అప్పులు ఇచ్చాడు కేసీఆర్. కేసీఆర్ పిల్లలకు మాత్రం అప్పులు లేవు..ఆస్తులే ఇచ్చారు. హరీష్.. కేటీఆర్ మాట్లాడే మాటలు జిమ్మిదారి మాటలు కావు.
తాడు బొంగరమా నీది. బావ బామ్మర్దులు ఇద్దరూ జోగడు..బాగడు. కాంగ్రెస్ ని..రేవంత్ ని అనడానికి మీకున్న అర్హత ఏంటి..? 70 ఏండ్లు ఎం చేసింది కాంగ్రెస్ అంటున్నారు బావ బామ్మర్దులు. సోనియాగాంధీ ఇంటికి వెళ్లి కాళ్ళు ఎందుకు మొక్కారు. తెలంగాణ ఇచ్చింది కాబట్టి కాళ్ళు మొక్కారు. ఇదే సాక్ష్యం కదా కాంగ్రెస్ ఎం చేసిందో చెప్పడానికి’ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.