ఉత్తరప్రదేశ్లో హలాల్ సర్టిఫికేట్పై నమోదైన కేసులో హలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
రాజస్థాన్లో నకిలీ పెన్షనర్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీంతో 4 లక్షల మంది పెన్షన్లు నిలిపివేసింది. సామాజిక న్యాయం, సాధికారత శాఖ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.
1997లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకం దాదాపు 4 కోట్ల కాపీలు అమ్ముడు పోయాయి. అయితే ఈ పుస్తకం రచయిత రాబర్డ్టి కియోసాకి ప్రస్తుతం తీవ్ర అప్పుల్లో ఉన్నారంటూ ఇన్స్టా వేదికగా ఓ రీల్ పోస్ట్ చేశారు.
ఇవాళ్టి నుంచి రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యాసంస్థలు సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్న ఈ తెలుగు మహాసభలు నేటి నుంచి ఆదివారం వరకు స్థానిక గైట్ కళాశాల ప్రాంగణం ఆతిథ్యమిస్తోంది.
తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు కేవలం 76 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించారని తెలిపారు. జిల్లాల విభజన, వివిధ శాఖల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్రానికి అదనంగా 29 అదనపు ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తికి కేంద్ర మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. 2024లో కొత్తగా…
బెంగళూరులోని తన నివాసంలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థి తన తండ్రి లైసెన్స్ పిస్టల్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు గురువారం తెలిపారు.
రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్ధ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనాల ప్రకారం 2031-32 నాటికి పెరగనున్న రాష్ట్ర విద్యుత్ అవసరాలను పరిగణలోకి తీసుకొని ఆయా వ్యవస్థల సామర్థ్యం పెంపొందించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర విద్యుత్ శాఖపై గురువారం ఆయన సచివాలయంలో…
2024 ఎన్నికలకు ముందు అంటే అధికారం కోసం కాంగ్రెస్ 'భారత్ జోడో న్యాయ యాత్ర' చేపట్టబోతోంది. కాంగ్రెస్ ఈ యాత్ర 6,700 కి.మీ. కంటే ఎక్కువ దూరాన్ని కవర్ చేస్తుంది. 110 జిల్లాలు, 100 లోక్సభ స్థానాలు, 337 అసెంబ్లీ స్థానాల్లో 67 రోజుల పాటు యాత్ర సాగనుంది.
తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. తమిళనాడులోని వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ, పునరుద్ధరణ, పునరావాస పనులు చేపట్టేందుకు తక్షణమే నిధులు విడుదల చేయాలని ప్రధానిని కోరారు.