డ్రై ఫ్రూట్స్ పోషకాల భాండాగారం.. డ్రై ఫ్రూట్ ఖర్జూరంలో చాలా ప్రయోజనకరమైనవి ఉన్నాయి. రోజూ ఖర్జూరం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఖర్జూరం తింటే రుచిగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. సాధారణంగా కొందరు ఎండు ఖర్జూరాలను తింటారు.. కానీ నానబెట్టిన ఖర్జూరాలు తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఖర్జూరాలను నానబెట్టినప్పుడు, అవి మెత్తగా నమలడం సులభం అవుతుంది. అంతేకాకుండా.. నానబెట్టిన ఖర్జూరంలో ఫైబర్, విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా…
ఈ ఏడాది సింగరేణిలో ప్రారంభించే 4 కొత్త గనులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరి కొన్ని నూతన బొగ్గు బ్లాకుల సాధించేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు పోతున్నామని సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ సింగరేణిలో కొత్త గనులపైనిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన పలు అంశాలపై లోతుగా చర్చించారు. నూతన గనులపై తగిన కార్యాచరణతో ముందుకెళ్లాలని, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్ని ఏరియాల జీఎంలను ఆదేశించారు.…
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టు కెరీర్ శనివారం (జనవరి 6)తో ముగిసింది. ఇటీవలే టెస్ట్ లకు, వన్డేలకు రిటైర్మెంట్ ఇచ్చిన వార్నర్.. తన కెరీర్ లో నేడు చివరి టెస్ట్ ఆడాడు. ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య మూడో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో వైట్‌వాష్ చేసింది. అంతేకాకుండా.. వార్నర్ కు ఆసీస్ జట్టు గెలుపుతో మంచి గిఫ్ట్ ఇచ్చింది.
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో ప్రజా పాలనను కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ తాటివర్తి జీవనరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం అవకతవకలపై న్యాయ విచారణ చేపడుతామన్నారు. కేసీఆర్ ను కాపాడేందుకు బీజేపీ సీబీఐ విచారణ చేపట్టాలంటోందని ధ్వజమెత్తారు. తుమ్మడి హెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం కోసం వచ్చే బడ్జెట్లో ప్రతిపాదనలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపాలపై పారదర్శకంగా వాస్తవాలను వెలికితీసేందుకే న్యాయవిచారణ చేపట్టాలన్నారు జీవన్ రెడ్డి. లిక్కర్ స్కాం విచారణను ప్రజలు…
చంద్రబాబుపై ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీపై టీడీపీకి సంబంధించిన మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని చంద్రబాబు అన్నారు.. ఎస్సీలకే కాదు.. ఎస్టీలకు కూడా చంద్రబాబు ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లనిచ్చిన మామ రామారావు చావుకు చంద్రబాబు కారణమయ్యారని తెలిపారు. చంద్రబాబుకు భూదాహం ధనదాహం ఎక్కువ.. కానీ పేదలపై ప్రేమ లేదని నారాయణ స్వామి ఆరోపించారు.
ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర అని అన్నారు మంత్రి సీతక్క. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మేడారం భక్తుల సౌకర్యార్థం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 75 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అధికారుల అందరు సమన్వయంతో జాతర పూర్తి చేయాలని ఆమె వెల్లడించారు. జాతరకు వచ్చే భక్తుల ప్లాస్టిక్ వినియోగం తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. జనవరి నెల లాస్ట్ వరకు జాతర పనులు పూర్తి చేస్తామని, రాష్ట్రస్థాయిలో సీఎం…
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. 4 ఏళ్ల 9నెలల జగన్మోహన్ రెడ్డి పాలన విధ్వంసకరం, నియంత్రత్వం, అవినీతి, అబద్ధాలమయమని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థతో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు జరిగిన నష్టం కంటే, జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన నష్టమే ఎక్కువని అన్నారు. రాష్ట్రం తిరిగి కోలుకోవడానికి కనీసం 15 ఏళ్లు పడుతుంది.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప రాష్ట్రానికి, ప్రజలకు భవిష్యత్…
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీఎస్ బీఐఈ) శనివారం జూనియర్ కాలేజీలకు జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. జనవరి 17న కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. అన్ని జూనియర్ కళాశాలలకు – ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్ మరియు అన్ ఎయిడెడ్, కో-ఆపరేటివ్, TS రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్, BC వెల్ఫేర్, KGBVలు మరియు ఇన్సెంటివ్ జూనియర్ కాలేజీలకు సెలవు వర్తిస్తుంది. ముఖ్యంగా…
కాకినాడ జిల్లా పెద్దాపురంలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ మోషెన్ రాజు, జూపూడి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. టీడీపీ, జనసేనపై విరుచుకుపడ్డారు. చాలా మంది బ్లడ్ రిలేషన్ కూడా కోల్పోయి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు, పవన్, కొందరు కొత్త వాళ్ళు జగన్ ను దించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెదక్ పట్టణంలో ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. ప్రజల నుంచి అభయ హస్తం దరఖాస్తులు మంత్రి దామోదర రాజనర్సింహ స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. వ్యవస్థ అనేది శాశ్వతం… వ్యవస్థను ఎంత ప్రతిష్ట పరిస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో అన్యాయం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క గ్రామంలో ఇల్లు దిక్కులేదు..జాగా దిక్కులేదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విజన్ ఉందన్నారు. ఇచ్చిన గ్యారెంటిలను…