Lava Blaze Duo 3: లావా బ్లేజ్ డ్యుయో 3 స్మార్ట్‌ఫోన్ విడుదలకు సిద్ధమంది. ఈ కొత్త లావా స్మార్ట్‌ఫోన్ జనవరి 19వ తేదీన భారత మార్కెట్లో లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన టీజర్ ఇప్పటికే ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రిలీజ్ అయింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వెలువడిన లావా బ్లేజ్ డ్యుయో 3 ఫీచర్లపై ఓసారి చూద్దాం.
లావా బ్లేజ్ డ్యుయో 3 స్పెసిఫికేషన్స్:
లావా బ్లేజ్ డ్యుయో 3 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందజేస్తుంది. ప్రత్యేకంగా ఈ ఫోన్‌లో 1.6 అంగుళాల సెకండరీ AMOLED డిస్‌ప్లేను కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7060 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది మెరుగైన CPU, GPU పని తీరును అందించి అన్ని యాప్‌లను స్మూత్‌గా ఉపయోగించే ఛాన్స్ కల్పిస్తుంది. అలాగే, కెమెరా విషయానికి వస్తే, లావా బ్లేజ్ డ్యుయో 3లో 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉంటుంది. దీంతో అద్భుతమైన ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చు.. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో పాటు పలు కెమెరా ఫీచర్లు కూడా ఉన్నాయి.
Read Also: రూ. 3 లక్షలకే ఈవీ కారు.. 5 నిమిషాల్లోనే ఛార్జింగ్, ఏఐ సిస్టమ్తో Blink Mobility Vehicle
అలాగే, ఈ ఫోన్ 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో రాబోతుంది. అదనంగా మెమరీ కార్డ్ సపోర్ట్ కూడా ఉంటుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌తో లాంచ్ కానుంది. ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇక, లావా బ్లేజ్ డ్యుయో 3కి IP64 రేటింగ్ ఉంది. దీని వల్ల డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ లభిస్తుంది. అలాగే, ఈ ఫోన్‌లో అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి. డిజైన్ పరంగా కూడా లావా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది.
Read Also: Reena Paswan: రాజ్యసభకు కేంద్రమంత్రి తల్లి? ఏ రాష్ట్రం నుంచంటే..!
ఇక, బ్యాటరీ విషయానికి వస్తే, ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000mAh బ్యాటరీని అందించారు. ఇది రోజంతా బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో తక్కువ సమయంలోనే ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే, కనెక్టివిటీ ఫీచర్లలో 5జీ, 4జీ వోల్టీఈ, వైఫై, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ లాంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఫోన్ బరువు 181 గ్రాములు. అన్ని ఆధునిక ఫీచర్లతో లావా బ్లేజ్ డ్యుయో 3 స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరలోనే అందుబాటులోకి రానుందని సమాచారం.