హైదరాబాద్ నగరానికి నాలుగు వైపులా నాలుగు డంప్ యార్డులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను కోరారు. నివాస ప్రాంతాలకు దూరంగా డంప్‌యార్డులు ఏర్పాటు చేయనున్నారు. డంప్ యార్డుల వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరం మొత్తం జవహర్ నగర్లో ఒకే ఒక్క డంప్‌యార్డు ఉంది. జవహర్ నగర్ డంప్ యార్డుకు రోజుకు 8 వేల టన్నుల చెత్త తరలిపోతోంది. డంప్‌యార్డు వల్ల వాయుకాలుష్యం, దుర్వాసనతో…
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కీలక ప్రకటన చేశాడు. త్వరలో దుబాయ్ వేదికగా జరగబోయే ఇంటర్నేషనల్ లీగ్ టీ20 ఆడనున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపాడు. అయితే, ఈ టోర్నీలో పాల్గొనే ప్రొఫెషనల్ ఆటగాళ్లకు ఎలాంటి రాజకీయ సంబంధాలు ఉండకూడదన్న నిబంధన ఉందని వివరణ ఇచ్చాడు. ఈ నెల 20 నుంచి మొదలయ్యే ఐఎల్ టీ20లో ముంబై ఎమిరేట్స్ కు ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపాడు. గతంలోనూ ఐసీఎల్ లోనూ ముంబై ఇండియన్స్ తరుఫున ఆడాడు.
ఏపీలో రేపటి నుంచి మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటించనుంది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటించనుంది. ఈ క్రమంలో.. రేపు ఎన్నికల అధికారుల బృందం విజయవాడ చేరుకోనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా.. ఈ నెల 9వ తేదీన వివిధ రాజకీయ పార్టీలతో భేటీ కానున్నారు.
డిజిటల్ సీడ్స్‌తో అగ్రిప్రెన్యూర్ షిప్ సాధ్యం అవుతుందని పల్సస్ సీఈవో డా. గేదెల శ్రీనుబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో వేలాది మంది రైతులతో జరిగిన సమావేశంలో `విజన్ ఫర్ అగ్రిప్రెన్యూర్షిప్ ఇన్ నార్త్ ఆంధ్ర`ని శ్రీనుబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గేదెల శ్రీనుబాబు వ్యవసాయరంగంలో అగ్రిప్రెన్యూర్షిప్ , డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ గురించి వివరించారు. సంప్రదాయ వ్యవసాయం కనుమరుగవుతున్న దశలో, రైతులు తమ క్షేత్రాలను వీడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగువిస్తీర్ణం…
వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీలో ఉంటానని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. జగన్ నకిలీ రెడ్డి కాబట్టే ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నాడని మండిపడ్డారు. కర్నూలు జిల్లాకు చెందిన జి.పుల్లారెడ్డి రామజన్మ భూమి నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు. రెడ్లు అంటే త్యాగానికి దానానికి వీరత్వానికి మారు పేరని బైరెడ్డి పేర్కొన్నారు. రెడ్డి తోక పెట్టుకొని కొందరు నకిలీ రెడ్లుగా చలామణి అవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాపట్ల జిల్లా అద్దంకిలో పొలిటికల్ సీన్ మారుతుంది. నియోజకవర్గంలో మొన్నటి వరకు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్లు పరిస్థితులు మారిపోయాయి. పాత కొత్త ఇంఛార్జ్ లను సమన్వయం చేయకపోవడంతో అద్దంకి వైసీపీ వ్యవహారాలు ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లుగా మారిపోతున్నాయి. కొత్త ఇంఛార్జ్ వైసీపీ నేతలను కలిసేందుకు ఊరురా తిరుగుతూ ఉంటే.. పాత ఇంఛార్జ్ ఆ ఊరి నేతలతో కలిసి మీటింగ్ పెట్టి సమాలోచనలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇంఛార్జ్…
రాయదుర్గం సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిడ్నాప్ కేసు.. డీసీపీ శ్రీనివాసరావు క్లారిటీ.. రాయదుర్గం సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిడ్నాప్ కేసులో నిందితుల అదుపులో తీసుకున్నట్లు మాదాపూర్ ఇంచార్జి డీసీపి శ్రీనివాస్ రావు అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కిడ్నాప్ కేసులో ఫిర్యాదు.చేసిన నిఖితనే ప్రధాన నిందితురాలుగా వెల్లడించారు. కిడ్నాప్ కు గురైన సురేందర్ సోదరి నిఖితగ గుర్తించినట్లు తెలిపారు. తన సోదరుడు కిడ్నాప్ కు గురైనట్లు రాయదుర్గం పోలీసులకు నిఖిత ఫిర్యాదు చేసింది. నిఖితతో మాట్లాడుతున్నప్పుడే సురేంద్ర…
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలను నెరవేర్చడంతోపాటు వాటిలో కొన్నింటిని అమలు చేయడంపై దృష్టి సారించిన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి అనువైన వాతావరణం కల్పించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై దృష్టి సారించింది. . సచివాలయంలో భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) ప్రతినిధులతో శనివారం జరిగిన సమావేశంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘స్నేహపూర్వక పారిశ్రామిక విధానం’ వైపు మళ్లాలని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. తెలంగాణ వ్యాప్తంగా పరిశ్రమల స్థాపన, అభివృద్ధి కోసం…
తిరువూరులో టీడీపీ బహిరంగ సభ నిర్వహించింది. అందులో భాగంగా.. సభలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై చర్చ జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో అందరూ వైసీపీ ఎమ్మెల్యేలను పేరుపేరునా చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. కానీ.. మైలవరం ఎమ్మెల్యే వసంత కృషప్రసాద్ ను మాత్రం ఒక్క మాట కూడా అనలేదు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పై మాత్రం ఏ విమర్శలు చేయకుండా చంద్రబాబు స్కిప్ చేశారు.
విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీ అభ్యర్థిత్వంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఝాన్సీ పోటీ విషయం ప్రస్తుతానికి అప్రస్తుతం అని అన్నారు. తనకు ఎటువంటి సమాచారం లేదు.. అధిష్టానం ఆలోచనల ఆధారంగా నిర్ణయం ఉంటుందని మంత్రి బొత్స తెలిపారు.