రాయదుర్గం సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిడ్నాప్ కేసు.. డీసీపీ శ్రీనివాసరావు క్లారిటీ..
రాయదుర్గం సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిడ్నాప్ కేసులో నిందితుల అదుపులో తీసుకున్నట్లు మాదాపూర్ ఇంచార్జి డీసీపి శ్రీనివాస్ రావు అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కిడ్నాప్ కేసులో ఫిర్యాదు.చేసిన నిఖితనే ప్రధాన నిందితురాలుగా వెల్లడించారు. కిడ్నాప్ కు గురైన సురేందర్ సోదరి నిఖితగ గుర్తించినట్లు తెలిపారు. తన సోదరుడు కిడ్నాప్ కు గురైనట్లు రాయదుర్గం పోలీసులకు నిఖిత ఫిర్యాదు చేసింది. నిఖితతో మాట్లాడుతున్నప్పుడే సురేంద్ర కిడ్నాప్ కు గురయ్యాడు. ఈనెల 4వ తేదీ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ చేశారని తెలిపారు. అయితే ఈ కేసు నమోదు చేసుకున్న కేవలం 48 గంటల్లో కిడ్నాప్ చేదించామని డీసీపీ వెల్లడించారు. డయల్ 100 కు ఇద్దరు సమాచార అందించారని, నిఖిత కిడ్నాప్ కు గురైన సమయంలో అక్కడే ఉందన్నారు. ఆమెతో పాటు మరో వ్యక్తిని వెంటనే విచారించామని అన్నారు. ప్రత్యేకంగా ఆరు టీమ్లను ఏర్పాటు చేసి ఈ కిడ్నాప్ ను ఛేదించినట్లు తెలిపారు.
టమోటోకి, పొటాటోకి తేడా తెలియని సీఎం జగన్: చంద్రబాబు
టమోటోకి, పొటాటోకి తేడా తెలియని సీఎం జగన్ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. సీఎం జగన్ రివర్స్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందన్నారు. దుర్మార్గుడు పాలిస్తే రాష్ట్రం కోలుకోలేని విధంగా దెబ్బతిందని మండిపడ్డారు. అప్పుల్లో రాష్ట్ర రైతులు అగ్రస్థానంలో ఉన్నారని, కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ‘రా.. కదిలిరా’ అని పిలుపునిస్తున్నా అని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు సభలో చంద్రబాబు మాటాడుతూ జగన్ పాలనను ఎండగట్టారు.
సిట్టింగ్ లను మార్చి ఉంటె బాగుండేది..! కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ లను మార్చి ఉంటె బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు అన్నారు. జహీరాబాద్ పార్లమెంటు సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు నిజాం సాగర్ మండలం లో మొత్తం ఇచ్చినా మిగతా వర్గాలు మనకు ఓట్లు వేయలేదన్నారు. ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష పడేలా సమాజం తయారైందన్నారు. ‘బంధు ‘పథకాల ప్రభావం మనపై పడిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ లను మార్చి ఉంటె బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉందన్నారు.
ఇండియా కూటమితో వెళ్లలా.. వద్దా.. తేల్చి చెప్పనున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అందరి చూపు ఉత్తరప్రదేశ్ రాజకీయాలపైనే పడింది. బహుజన్ సమాజ్ పార్టీ తన వాదనపై దృఢంగా ఉంటుందా.. భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి(INDIA) కూటమిలో BSP భాగం అవుతుందా లేదా అన్న నిర్ణయంపై అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్‌డిఎ) ఎవరిలోనూ భాగం కాదని, యూపీలో ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తామని మాయావతి ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఆమె పుట్టినరోజు సందర్భంగా పొత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన చేయవచ్చన్న వార్తలు వస్తున్నాయి.
ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియలో గవర్నర్ చొరవ చూపాలి..!
గవర్నర్ చొరవ చూపీ, ఉద్యోగ నియామకాల భర్తీ ప్రకియకు మార్గం సుగమం చేయాలని గవర్నర్ తమిళిసై కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేసారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పీఆర్టీ టీఎస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఉపాధ్యాయ సంఘ నాయకులుతో కలిసి జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వ నిర్లక్ష్యమే విద్యార్థుల సంఖ్య తగ్గుదలకి కారణమన్నారు. కేజీ టు పీ జీ ఉచిత విద్య ప్రకటనలకే పరిమితం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాల్సి ఉండగా.. క్రమబద్ధీకరణ నెపంతో పాఠశాలలు మూసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలకు విద్యను దూరం చేశారని, ఓపీఎస్ విధానం అమలుకి విధాన పరమైన నిర్ణయం చేపడుతామన్నారు. 317 జోనల్ విధానం అమలుతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జోనల్ విధానాన్ని సమీక్షించి, ఉమ్మడి జిల్లాలప్రాతిపదికన జోన్ గా ఏర్పాటు చేసేలా కృషి చేస్తామన్నారు.
ఈ హ్యాండ్ బ్యాగ్ కొనే బదులు..ఢిల్లీలో వందల ప్లాట్లు కొనుక్కోవచ్చు
ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల హ్యాండ్‌బ్యాగ్‌లు అందుబాటులో ఉన్నాయి. దాని పరిమాణం, రంగు, నాణ్యతను బట్టి వాటి ధర ఆధారపడి ఉంటుంది. చాలా మంది మహిళలు హ్యాండ్ బ్యాగుల సేకరణ హాబీని కలిగి ఉంటారు. సందర్భాన్ని బట్టి నప్పిన హ్యాండ్ బ్యాగులను వేసుకుని వెళ్తుంటారు. కొన్ని కొన్ని సార్లు సెలబ్రిటీలు వాడే హ్యాండ్ బ్యాగుల ధరలు చూసి సామాన్యులు షాక్ అవుతుంటారు.
ఇప్పుడు లేడీస్ బ్యాగులు రూ.500 నుంచి రూ.10 వేల వరకు సులభంగా లభిస్తున్నాయి. హ్యాండ్‌బ్యాగ్ ధర ఇక్కడితో ముగియలేదు..రాను రాను లక్షలు, కోట్లకు చేరుతుంది. ప్రస్తుతం ఓ బ్యాగు గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. దీని పెట్టే డబ్బులు పెడితే రాజధాని ఢిల్లీలో డజన్ల కొద్ది ప్లాట్లు, ఇళ్లు కొనుక్కోవచ్చట.
ఇంటిపేరు ఒకేలా ఉంటే చుట్టాలు అయిపోతారా..? బీజేపీ పై వినోద్ కుమార్ ఫైర్
ఇంటిపేరు ఓకే విధంగా ఉంటే చుట్టాలుగా పరిగణించడం అనేది ఏ సంస్కృతి? అని బీజేపీ పై మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు. చుట్టాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి రికమండేషన్ చేసినానని వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. జర్నలిజం విలువలు తెలియని వాళ్ళు జర్నలిజం చేసి వార్తలు రాయాలని మండిపడ్డారు. తీన్మార్ మల్లన్న వార్తలు వేసే ముందు జర్నలిజం గురించి తెలుసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ సోషల్ మీడియాలో వేసిన వార్త ఏ ఆధారాలతో వేశారు? అని ప్రశ్నించారు. ఇంటిపేరు ఓకే విధంగా ఉంటే చుట్టాలుగా పరిగణించడం అనేది ఏ సంస్కృతి? అని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రపంచమంతా తిరిగిన అబద్ధ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాబోయే ఎంపీ ఎలక్షన్లలో ఎవరేం చేసారు అనేది అన్ని బయట పెడతా అని హెచ్చారించారు.
పండుగల వేళ ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దు: ఆదిమూలపు సురేష్
పండుగలు వస్తున్నాయని, ప్రజలను అస్సలు ఇబ్బందులు పెట్టోద్దని ఉద్యోగాలను ఉద్దేశించి ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రజలకు సేవలు అందించే మున్సిపల్ శాఖ ఉద్యోగులు బాధ్యతగా వ్యవహరించాలని, చర్చలు ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి తప్ప ర్యాడికల్ విధానంలో వెళితే సమస్యలు పెరుగుతాయన్నారు. నేడు ఏపీ మున్సిపల్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి మహాసభ విశాఖలో జరిగింది. ముఖ్యఅతిథులుగా మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయ సాధకుడు జగన్ మోహన్ రెడ్డి..
విజయవాడలో ఈనెల 19వ తేదీన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ జరగనుంది. విగ్రహావిష్కరణ విజయవంతం చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్, పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ షేక్ ఆసిఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయ సాధకుడు జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. అంబేద్కర్ గొప్పతనాన్ని తెలియజేసేలా స్మృతివనం ఉండబోతోందని తెలిపారు. విజయవాడ నగరం గతంలో ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉందో అందరూ గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు కార్పొరేట్ వ్యక్తులకు స్వరాజ్య మైదానాన్ని కట్టబెట్టాలని చూశారని అవినాష్ దుయ్యబట్టారు. జగన్ రాజ్యాంగ ప్రదాత అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అవినాష్ తెలిపారు.
తెనాలి సీటు ఎవరికి ఇవ్వాలనే నిర్ణయం అధినాయకత్వంకి వదిలి వేశాం..
గుంటూరు జిల్లాలో టీడీపీ-జనసేన మధ్య పొత్తుల వ్యవహారం క్షేత్రస్థాయిలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకుని కలిసిపోయామని చెప్పిన నాయకులు.. ఇప్పుడు ఎవరికి వారే ప్రత్యేక కార్యక్రమాలు చేసుకుంటున్నారు. సీటు తమకే వస్తుందని జనసేన-టీడీపీ నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. ముఖ్యంగా తెనాలి నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజాలు సీటు కోసం పోటీపడుతున్నారు. దీంతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది.
నెల రోజుల పాలనలో ప్రజలకు మరింత దగ్గరయ్యాం
నెల రోజుల పాలనలో ప్రజలకు మరింత దగ్గరయ్యామన్నారు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీటి పారుదల శాఖలో జవాబుదారీ, పారదర్శకంగా పని చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రజా పాలన అంటే ఎలా ఉండాలో నెల రోజుల్లోనే చేసి చూపించామని, ప్రజలు తెలంగాణ లో కొత్తగా స్వాతంత్రం వచ్చినట్టు భావిస్తున్నారు. ఒక నియంత పాలన అంతమైందన్న ఆనందంలో ఉన్నారన్నారు. ప్రజలకు పాలకులు, అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటున్నారని, తెలంగాణ ప్రజలు ప్రభుత్వం నుంచి ఎలాంటి పాలన ఆశిస్తున్నారో అది వారికి అందుతుందని ఆయన వెల్లడించారు. నీటి పారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ లో అనేక సమీక్షలు చేసామని, ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్ట్, మెడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం లాంటి అంశాలలో సమీక్ష చేసాము. జ్యూడిషియల్ ఎంక్వరీ కోసం ఒక సిట్టింగ్ జడ్జి ని నియమించాలని కోరామన్నారు.
ఇండస్ట్రీస్ కోసం మెగా మాస్టర్ ప్లాన్
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలను నెరవేర్చడంతోపాటు వాటిలో కొన్నింటిని అమలు చేయడంపై దృష్టి సారించిన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి అనువైన వాతావరణం కల్పించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై దృష్టి సారించింది. . సచివాలయంలో భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) ప్రతినిధులతో శనివారం జరిగిన సమావేశంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘స్నేహపూర్వక పారిశ్రామిక విధానం’ వైపు మళ్లాలని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.