Minister Bosta: విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీ అభ్యర్థిత్వంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఝాన్సీ పోటీ విషయం ప్రస్తుతానికి అప్రస్తుతం అని అన్నారు. తనకు ఎటువంటి సమాచారం లేదు.. అధిష్టానం ఆలోచనల ఆధారంగా నిర్ణయం ఉంటుందని మంత్రి బొత్స తెలిపారు.
Alapati Raja: తెనాలి సీటు ఎవరికి ఇవ్వాలనే నిర్ణయం అధినాయకత్వంకి వదిలి వేశాం..
మరోవైపు చంద్రబాబుపై బొత్స తీవ్ర విమర్శలు గుప్పించారు. క్రేన్లు, జాకీలు పెట్టిన చంద్రబాబు లేవలేడని దుయ్యబట్టారు. వైసీపీలో సమన్వయకర్తల మార్పుపై ఆందోళనలు తప్పు అని అన్నారు. అసంతృప్తి ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాం.. పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోవాలని కోరుకోవడం లేదు ఒకరు వెళితే వంద మంది వస్తారని మంత్రి బొత్స పేర్కొన్నారు.