ఏపీలో అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పందించారు. ఏపీలో సమ్మె చేయని కార్మిక వర్గం లేదని ఆరోపించారు. అంగన్ వాడీలు, మున్సిపల్ కార్మికులు, సర్వశిక్షా అభియాన్ సిబ్బంది, 108-104 అంబులెన్సుల ఉద్యోగులు సమ్మెలోనే ఉన్నారని తెలిపారు. వారి డిమాండ్ల మొత్తం విలువ జగన్ రెడ్డి తన విలాసాల కోసం తగలేసినంత ఉండొచ్చని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీ అమలు కోసం పోరాడుతున్న వారిపై…
లోక్సభ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా 17 లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జులను నియమించింది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్రెడ్డి సోమవారం నియమించారు. లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జ్లుగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఎ.వెంకట్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీ గరికపాటి మోహన్రావు, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.…
నిన్న పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో టీడీపీ అధినేత చంద్రబాబు 'రా కదలిరా' కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ఎమ్మెల్యేలుపై తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఈ నేపధ్యంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. తన పుట్టినరోజుకు వచ్చిన జనం కూడా.. నిన్న ఆచంటలో…
ప్రీ లాంచింగ్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థ సాహితీ ఇన్ఫ్రా చేసిన వసూళ్ల దందాపై పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫ్లాట్లు నిర్మాణం చేసి ఇస్తామని డబ్బు కట్టించుకుని మోసం చేశారని 2022 ఆగష్టులో సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ భూదాటి లక్ష్మీ నారాయణపై యశ్వంత్ కుమార్తో పాటు మరో 240 మంది హైదరాబాద్ సీసీఎస్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎండీ లక్ష్మీ నారాయణను…
బిల్కిస్ బానో కేసులో భారత సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది నిందితుల క్షమాభిక్షను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
నేడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్యాహ్నం 12 గంటలకు వికాస్ భారత్ సంకల్ప యాత్ర లబ్ధిదారులతో వర్చువల్ గా మాట్లాడబోతున్నారు. వికాస్ భారత్ సంకల్ప యాత్రతో పాటు నడుస్తున్న ప్రచార రథాల్లో ప్రధాని నేరుగా పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుభాష్ యదువంశ్ తెలిపారు.
ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల పరిశీలన, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, నోడల్ అధికారులు పాల్గొననున్నారు. ప్రజాపాలన పై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్-సైట్ prajapalana.telangaana.gov.in ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలనలో మొత్తం1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. అయితే.. ఐదు గ్యారేటీలకు సంబంధించి 1,05,91,636 దరకాస్తులు…
తన కూతురు పడొద్దని ఆ యువకుడికి ఆ తండ్రి ఎన్నిసార్లు చెప్పాడో.. చివరకు ఆవేశం ఆగక కడతేర్చాలని చూశాడు. పద్ధతి గల కుటుంబం కావున తన కూతురు వెంట ఓ యువకుడు పడుతున్నాడని నలుగురికి తెలిస్తే పరువు పోతుందనుకున్న తండ్రి.. చివరకు చంపేందుకు సిద్ధమయ్యాడు. సినిమాటిక్ టైప్ లో తన కొడుకుతో కలిసి తన కూతురు వెంటపడుతున్న యువకుడిపై దాడి చేశారు.
తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని కోరిన బోరబండకు చెందిన ఇబ్రహీం ఇంటికి ఈరోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. జనవరి 2వ తేదీన నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బోరబండకు చెందిన ఇబ్రహీంఖాన్ కేటీఆర్ కి ట్విట్టర్ వేదికగా జనవరి రెండవ తేదీన శుభాకాంక్షలు తెలియజేశారు. గత పది సంవత్సరాలుగా భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఆధ్వర్యంలో పగలు రాత్రి అనే తేడా లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అద్భుతమైన పని చేశారని…