దేశ రాజధాని ఢిల్లీలో కత్తిపోట్లకు సంబంధించిన ఘటనలు వరుసగా పెరుగుతున్నాయి. తాజాగా.. ఆగ్నేయ ఢిల్లీలోని బదర్పూర్ ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి ఓ వ్యక్తిపై ఐదుగురు యువకులు కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం నిందితులంతా అక్కడి నుంచి పారిపోయారు. అయితే.. ఆ సమయంలో అక్కడ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు గమనించి.. వారిపై అనుమానంతో నిందితులని వెంబడించి పట్టుకున్నారు. ఈ ఘటన అర్థరాత్రి 2:30 గంటల తర్వాత జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై డీసీపీ సౌత్ ఈస్ట్…
దేశంలో అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడో చోట గ్యాంగ్ రేప్ లు, చిన్నపిల్లలపై అత్యాచారాలు పెట్రేగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. కామాంధులు ఆగడం లేదు. అతి దారుణంగా ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ లో అత్యాచార ఘటన చోటు చేసుకుంది.
10 సంవత్సరాలుగా కండక్టర్ కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇవాళ రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. కారుణ్య నియామకాల కింద 813 మందికి కండక్టర్లుగా తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. టీఎస్ ఆర్టీసీలో పని చేస్తూ విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది వారసులకు కారుణ్య నియామకాల కింద కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని ఆర్టీసీ అధికారులకు రవాణా బీసీ సంక్షేమ శాఖ…
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఈసీ బృందం పర్యటించిన సంగతి తెలిసిందే. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, రాష్ట్ర ఉన్నతాధికారులతో ఈసీ సమావేశాలు, సమీక్షలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్‌కుమార్ విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై నేడు మరోసారి హైకోర్టు విచారణ చేపట్టింది. కోర్టు ను తప్పుదోవ పట్టించారా లేదా.. అని చెన్నమనేని ప్రశ్నించిన హైకోర్టు… కోర్టు ను తప్పుదోవ పట్టించునే వాళ్లకు ఉపషమనం ఎందుకు కల్పించాలని వ్యాఖ్యానించింది. 2018 ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో జర్మనీ పౌరసత్వం తో పోటీ చేసారన్న హైకోర్టు.. జర్మనీ పౌరసత్వం తోనే ఇంకా ప్రయాణాలు చేస్తున్నారా అని హైకోర్టు ప్రశ్నించారు. 2018 ఎన్నికల సందర్భంగా జర్మనీ…
ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ -2 అభ్యర్థులకు ఊరట అందించే వార్త ఒకటి చెప్పింది ఏపీపీఎస్సీ. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువును మరో వారం రోజులు పొడిగించింది. ఈనెల 17 వరకు పొడిగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ(APPSC) అధికారులు తెలిపారు. గ్రూప్- 2 పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసే సమయంలో.. ఏపీపీఎస్సీ వెబ్సైట్ నిర్వహణ అధ్వానంగా ఉందని అభ్యర్థులు తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు రోజుల తరబడి ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు…
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. సీఎం జగన్‌తో కీలక భేటీ అనంతరం కేశినాని నాని మీడియా సమావేశంలో మాట్లాడారు. తనను టీడీపీలో తీవ్రంగా అవమానించారని, తన రాజీనామాను ఆమోదించిన అనంతరం వైసీపీలో చేరతానని ఆయన తెలిపారు.
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రాచకొండలో మరొకసారి భారీగా డ్రగ్స్ ను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 80 గ్రాములు హైరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ కు చెందిన ఇద్దరు యువకులతో పాటు ఓ స్టూడెంట్ ను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి విద్యార్థులకు యువకులు అమ్ముతున్నారు.. అను ఇంజనీరింగ్ కాలేజీలకి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీ-ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్న అశోక్ కుమార్ తో పాటు…
ఏపీ కాంగ్రెస్ కొత్త ఊపందుకుంది. ఏపీ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ఇంఛార్జ్ గా మాణిక్కం ఠాకూర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారీ మార్పులు కనిపిస్తోంది. అందుకు తోడు.. షర్మిల కూడ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీలో జోష్ కనిపిస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు కొందరు పార్టీలో చేరారు. సినిమా ప్రొడ్యూసర్ కళ్యాణ్ చక్రవర్తి, బీఆర్ఎస్ నేతలు, జె.డి.లక్ష్మీనారాయణ అనుచరులు, వైసీపీ, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో…
ఎయిరో స్పేస్ రంగానికి తెలంగాణ స్వర్గధామమని, దేశంలోనే ఇక్కడ శక్తివంతమైన ఎయిరో స్పేస్ ఎకోసిస్టమ్ ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, వాణిజ్య, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఎయిరో స్పేస్ ఉత్పత్తుల తయారీకి హైదరాబాద్ కేంద్రంగా మారిందన్నారు. శంషాబాద్ లోని ఆదానీ డిఫెన్స్ మరియు ఎయిరోస్పేస్ సెంటర్ లో భారతీయ నేవీ కోసం ఆ ఆదానీ సంస్థ దేశీయంగా తయారు చేసిన ద్రిష్టి 10 స్టార్ లైనర్ అన్…