వైసీపీకి మరో నేత గుడ్‌బై చెప్పారు. కర్నూలు ఎంపీ పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి డా.సంజీవ్‌కుమార్ రాజీనామా చేశారు. ఎంపీ టికెట్ లేదని తేలడంతో ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
మాజీ కేంద్రమంత్రి, టీడీపీ సీనియర్ నేత సామాన్యుడిలా రైల్వే ప్లాట్ ఫాం మీద కూర్చున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సికింద్రాబాద్ నుంచి విజయనగరం రైలులో ప్రయాణించుటకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్ అరుగు మీద కూర్చున్నారు. గతంలో కేంద్ర విమానయానశాఖ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు రాజకుటుంబానికి చెందినవారు. అయితే సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన ఆయన.. ఒక సామాన్య ప్రయాణికుడిలా రైల్వే స్టేషన్లో కనిపించారు.…
నిత్యం ప్రయాణీకులతో బిజీ బిజీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్ లో ఓ కోడి పుంజును కట్టి పడేశారు. బస్సుల్లో ప్రయాణీకులు ఉండాల్సిన చోట ఉండడం ప్రత్యేకంగా నిలిచింది. ఇంతకీ ఈ కోడి ఎక్కడ నుండి వచ్చిందో తెలిస్తే ఆశ్చర్య పోతారు. అంతేకాదు దాని బాధ్యతలు ఆర్టీసీ యాంత్రాంగంపై పడడంతో బోను ఏర్పాటు చేసి దానా, నీటిని అందిస్తున్నారు. ఇంతకీ ఆ కోడి వివరాలేంటి… ఎక్కడినుండి వచ్చిందో తెలుసుకుందాం… వరంగల్ నుండి వేములవాడ రాజన్న క్షేత్రానికి ఓ ఆర్టీసీ…
ఎన్నికలపై సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బుంటేనే ఎన్నికలలో పోటీ చేయాలి అన్నట్లు వ్యవస్థ మారిపోయిందన్నారు. ప్రస్తుత రాజకీయాలు గౌరవప్రదంగా లేవన్నారు.
కొంతమందిలో పడుకున్నప్పుడు గురక అనేది వస్తుంది. దాని వల్ల వారు బాగానే పడుకున్నా.. ఎదుటి వారు మాత్రం చాలా ఇబ్బంది పడుతారు. గురక అనేది శ్వాసలో ఇబ్బంది వల్ల వస్తుంది. అంతేకాకుండా.. ఎక్కువ బరువున్న వాళ్లు, చెడు జీవనశైలి, ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్న వాళ్లకు గురక వస్తుంది. అయితే గురక సమస్యతో పోరాడుతున్నట్లయితే.. ఈ సింపుల్ హోం రెమెడీస్ వల్ల ఆ సమస్య నుండి బయటపడచ్చు.
మున్సిపల్ కార్మిక సంఘాలను మరోసారి ఏపీ ప్రభుత్వం చర్చలకు పిలిచింది. కార్మిక సంఘాలతో సచివాలయంలోని సెకండ్ బ్లాక్‌లో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వర్చువల్‌గా సమావేశం కానున్నారు.
నేను గతంలో సవాల్ చేసినట్టు 10కి 10 సీట్లు అన్నానని, అన్నం తింటుంటే ఓ మెతుకు జారిపడ్డట్టు ఓ స్థానం పోయిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మిగిలిన 9 స్థానాల్లో మనమే గెలిచామన్నారు. మమ్మల్ని ఓడించాలని విచ్చలవిడిగా ఖర్చు పెట్టారని, అధికారులను ఉపయోగించి అక్రమ కేసులు పెట్టారన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కేసీఆర్ ఏ మీటింగ్ లో మాట్లాడినా మా ఇద్దరి గురించేనన్నారు. కరటక ధమణుకలు అని మాకు పేరు పెట్టారని,…
విజయవాడ ఎంపీ కేశినేని రాజకీయ భవిష్యత్‌పై స్పష్టత వచ్చింది. కుమార్తె శ్వేతతో పాటు కేశినేని నాని వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ అయ్యారు.
అదానీ గ్రూప్ తయారు చేసిన దృష్టి 10 ‘స్టార్‌లైనర్’ మానవరహిత వైమానిక వాహనం (UAV)ని భారత నావికాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరి కుమార్ బుధవారం హైదరాబాద్ లోని అదానీ ఏరోస్పేస్లో ఆవిష్కరించారు. ఈ డ్రోన్లు భారత నౌకా దళ శక్తి సామర్థ్యాలను మరింత పెంపొందించేలా తయారు చేశారు. అంతేకాకుండా.. సముద్రంలో నిఘా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దృష్టి డ్రోన్లను ప్రత్యేకంగా డిజైన్ చేయించామని హరి కుమార్ వివరించారు. దృష్టి 10 ‘స్టార్‌లైనర్’ అనేది ఒక అధునాతన…
ఖమ్మం జిల్లా కూసుమంచిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. పొంగులేటి కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రైతుబంధుపై అపోహలు వద్దని.. పండుగ అయిపోగానే రైతులందరికీ రైతుబంధు అందుతుందని తుమ్మల తెలిపారు. ఎంత అహంకారం ఉన్నా.. ప్రజల ముందు దిగదుడుపే అని తెలంగాణ ప్రజలు నిరూపించారన్నారు. తెలంగాణలో కబ్జాల రాజ్యం పోవాలని ప్రజలు కోరుకున్నారని.. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు.